అక్కినేని వారసుడు 'లవ్ స్టోరీ'కి సూపర్ స్టార్ సపోర్ట్ దొరికింది. సాయి పల్లవితో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తన లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు చైతూ. ఏప్రిల్ 16వ తేదీన ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు చేతులమీదుగా 'ఏవో ఏవో కలలే...' సాంగ్ రిలీజ్ చేయించారు మేకర్స్. తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ద్వారా ఈ సాంగ్ రిలీజ్ చేసిన మహేష్ బాబు.. లవ్ స్టోరీ నుంచి ఈ యూత్‌ఫుల్ సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని తెలుపుతూ చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. జోనిత గాంధీ, నకుల్ అభ్యంకర్ ఈ సాంగ్ ఆలపించారు. ఈ పాటకు భాస్కరభట్ల రవి కుమార్ అందించిన బ్యూటిఫుల్ లిరిక్స్ యూత్‌ని ఫిదా చేస్తున్నాయి. ఫీల్ గుడ్ 'లవ్ స్టోరీ'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే విడుదలైన 'సారంగ దరియా' లిరికల్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతుండగా.. తాజాగా విడుదలైన 'ఏవో ఏవో కలలే...' సాంగ్ సినిమాపై హైప్ పెంచేసింది. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Qrvt1V
No comments:
Post a Comment