HBD Sharwanand: శర్వానంద్ బర్త్ డే గిఫ్ట్.. మహాసముద్రం నుంచి హీరో లుక్ రిలీజ్

సినిమా సినిమాకు తన నటనలో పరిణితి పెంచుకుంటూ వస్తున్న యంగ్ హీరో లేటెస్ట్ మూవీ ''. గతంలో ఎన్నడూ చూడని వైవిద్యభరితమైన కథాంశాన్ని తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్ పరిసరాల్లోని అందమైన లొకేషన్స్‌లో జరుగుతోంది. కాగా నేడు (మార్చి 6) శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి శర్వానంద్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో శర్వానంద్ పవర్‌ఫుల్ గెటప్‌తో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. చేతిలో పదునైన ఆయుధం పట్టుకొని ఆయన దర్శనమివ్వడం చూస్తుంటే ఈ సినిమాలో ఆయన రోల్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో లవర్ బాయ్ సిద్ధార్ద్ మరో హీరోగా నటిస్తుండటం విశేషం. మొదటి సినిమా RX 100తో దర్శకుడిగా టాలెంట్ రుజువు చేసుకున్న అజయ్ భూపతి ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాలని పట్టుదలగా ఉన్నారు. ఈ మేరకు ప్రతి సన్నివేశంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ సర్వ హంగులతో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో అదితి రావ్‌ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 19న రిలీజ్ కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3edA8yp

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts