గతేడాది దేశాన్ని గడగడలాడించి కాస్త శాంతించిన మహమ్మారి మెల్లమెల్లగా మరోసారి కోరలు చాస్తోంది. తాజా పరిస్థితులు చూస్తుంటే కరోనా మహమ్మారి మరోమారు దాడికి సిద్ధమైందని అర్థమవుతోంది. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో కరోనా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడాది పాటు కరోనా కల్లోలంలో చిక్కుకున్న సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. మళ్ళీ కరోనా పంజా విసురుతుండటం గుబులు పుట్టిస్తోంది. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కాగా తాజాగా మరో బాలీవుడ్ యాక్టర్ కార్తీక్ ఆర్యన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆర్యన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్లస్ సింబల్‌ను షేర్ చేస్తూ తనకు కరోనా సోకిందని తెలుపుతూ సందేశం పోస్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారంతా ఎలాంటి చిన్న లక్షణాలు కనిపించినా వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోవాలని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే కార్తీక్ ఆర్యన్‌కు కరోనా పాజిటివ్ అని తేలడం యంగ్ హీరోయిన్ కియారా అద్వానీని టెన్షన్‌లో పడేసింది. శనివారం ముంబైలో జరిగిన 'లక్మి' ఫ్యాషన్ వీక్‌లో హీరోయిన్ , ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నారు కార్తీక్. అలాగే కియారా, టబులతో కలిసి 'భూల్ భులైయా-2' మూవీ షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. దీంతో కియారా అద్వానీ, కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారని తెలుస్తోంది. కాగా, సరిగ్గా గతేడాది కరోనా భయం మొదలైన ఈ నెలలోనే మరోసారి డేంజర్ బెల్స్ మోగుతుండటం ఆందోళనకరంగా మారింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lF5aRs
No comments:
Post a Comment