కుటుంబ సమేతంగా రెండు గంటల పాటు హాయిగా చూడదగిన సినిమాలను అందిస్తోన్న ఈతరం హీరోల్లో శర్వానంద్ ముందు వరుసలో ఉంటారు. ‘మళ్లీ మళ్లీ ఇది రానీరోజు’, ‘శతమానం భవతి’, ‘మహానుభావుడు’, ‘పడిపడి లేచే మనసు’, ‘జాను’.. ఇలా ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన హీరోగా వచ్చిన మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘శ్రీకారం’. ఆధునిక వ్యవసాయం, యువత వ్యవసాయంలోకి రావటం వంటి బాధ్యతాయుతమైన సబ్జెక్ట్‌తో శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం ద్వారా కిషోర్ బి దర్శకుడిగా పరిచయమయ్యారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. శర్వానంద్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. రావు రమేష్, వీకే నరేష్, ఆమని, సాయికుమార్, మురళీ శర్మ, సత్య, సప్తగిరి ముఖ్య పాత్రలు పోషించారు. మహాశివరాత్రి కానుకగా ఈరోజు (మార్చి 11న) ‘శ్రీకారం’ విడుదలైంది. ఇప్పటికే ‘శ్రీకారం’ యూఎస్ ప్రీమియర్లు మొదలయ్యాయి. అక్కడ సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. సినిమా చాలా బాగుందని అంటున్నారు. ఇలాంటి సినిమాలు టాలీవుడ్‌లో మరిన్ని రావాల్సిన అవసరం ఉందంటున్నారు. శర్వానంద్ ఇలాంటి కథను ఎంపిక చేసుకున్నందుకు ఆయన్ని కచ్చితంగా అభినందించాల్సిందేనని కొనియాడుతున్నారు. ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉందని.. ఇక సెకండాఫ్ భావోద్వేగ సన్నివేశాలకు కట్టిపడేస్తుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ ముందు 30 నిమిషాలు వచ్చే సన్నివేశాలతో ప్రేక్షకులు కచ్చితంగా సినిమాకు కనెక్ట్ అయిపోతారని ఒక ప్రేక్షకుడు పేర్కొన్నారు. మురళీ శర్మ, శర్వానంద్ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయట. ‘‘ఉద్యోగం వస్తే అమ్మని బాగా చూసుకుందాం అని అనుకున్నానురా.. ఇప్పుడు ఉద్యోగం తప్ప ఇంకేం చూసుకోలేకపోతున్నా’’ అంటూ మురళీ శర్మ చెప్పే డైలాగ్ అందరికీ కనెక్ట్ అవుతుందని అంటున్నారు. ఎమోషన్ సీన్స్‌లో శర్వానంద్ యాక్టింగ్ చాలా బాగుందని ట్వీట్లు చేస్తున్నారు. అలాగే రావు రమేష్ నటన కూడా సినిమాకు మరో బలం అంటున్నారు. వ్యవసాయం గురించి డిఫరెంట్ యాంగిల్‌లో చెప్పడానికి ‘శ్రీకారం’ చుట్టిన దర్శకుడు దానికి కొన్ని కమర్షియల్ హంగులు మేళవించి కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారని అంటున్నారు. అయితే, మరికొందరు సీరియస్ టాపిక్‌పై కమర్షియల్ మరకలు పడ్డాయని విమర్శిస్తున్నారు. మొత్తం మీద ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ కావడం ఖాయమంటున్నారు. అంటే, ఈ మహాశివరాత్రి నాడు శర్వా కూడా హిట్టుకొట్టేశాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30tOe6O
No comments:
Post a Comment