పవర్ స్టార్ రీ ఎంట్రీ మూవీ ‘’ కోసం కోట్లాదిమంది మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా ‘వకీల్ సాబ్’ విడుదల కానుంది. జనసేన అధినేతగా ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన పవర్ స్టార్ నుంచి ఎన్నికల తరువాత వస్తున్న తొలి చిత్రం ‘వకీల్ సాబ్’ కావడంతో ఈ చిత్రం సినీ రాజకీయ వర్గాల్లో బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో ఈ సినిమా అదిరిపోయింది అంటూ రివ్యూ ఇచ్చేశారు ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు. మోస్ట్ కాంట్రవర్సియల్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ క్రిటిక్‌గా తనని తాను ప్రకటించుకున్న ఉమర్.. సినిమా విడుదలకు ముందే తాను సినిమాలు చూశానంటూ.. తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌ని అని రివ్యూలు ఇస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఇటీవల ఇతని ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ కావడంతో మళ్లీ కొత్త అకౌంట్‌తో రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు. తాజాగా ‘వకీల్ సాబ్’ చిత్రానికి సంబంధించిన రివ్యూ ఇచ్చేశాడు ఉమైర్ సంధు. వకీల్ సాబ్ సెన్సార్ రిపోర్ట్ సాలిడ్ అండ్ టెర్రఫిక్... సింగిల్ కట్ లేకుండా సెన్సార్ కంప్లీట్ చేసుకుందని.. ఔట్ స్టాడింగ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అని.. బిగ్గెస్ట్ హిట్ అందుకోబోతున్నారంటూ రివ్యూ ఇచ్చారు ఉమైర్ సంధు. అయితే గతంలో ఇతగాడు.. కాటమరాయుడు, అజ్ఞాతవాసి స్పైడర్ చిత్రాలకు కూడా విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ హిట్ అంటూ రివ్యూలు ఇచ్చాడు. ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. దీంతో మనోడు ఇచ్చే రివ్యూలపై విశ్వసనీయత సన్నగిల్లింది. వకీల్ సాబ్ సినిమాతో వాటిని ముడిపెట్టి చూడలేం. ఆల్రెడీ హిట్ అయిన సినిమాకి రీమేక్.. అందులోనూ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కాబట్టి అన్నీ సానుకూలంగానే ఉన్నాయి. పాజిటివ్ బజ్‌తో ఈ సినిమా విడుదలౌతుండటంతో హిట్ పక్కా అని విశ్లేషకులు చాలామంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. 'పింక్' మూవీ తెలుగు రీమేక్‌గా ఈ 'వకీల్ సాబ్' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా సమర్పిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనుండటం విశేషం. అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల కీలకపాత్రల్లో కనిపించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3txVhrF
No comments:
Post a Comment