సినీ ఇండస్ట్రీకి గతేడాది కరోనా తెచ్చిన కష్టాలు అన్నీఇన్నీ కావు. చాలా మంది సినీ నటులు కరోనా కాటుకు బలి కావడం యావత్ సినీ లోకాన్ని కలచి వేసింది. ఎందరో సినీ నటులు ఆర్ధిక కష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుపుతూ, ఆర్థిక సహాయాన్ని కోరుతూ ఒక వీడియో రిలీజ్ ద్వారా వేడుకున్నారు సీనియర్ విలన్ . టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించిన ఆయన కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఈ నటుడు వెంటిలేటర్‌పై ఉన్నాడు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేస్తేనే బ్రతుకుతాడని వైద్యులు చెప్పారట. ఈ క్రమంలో కిడ్నీ మార్పిడి చికిత్స కోసం భారీగా ఖర్చవుతుందని, ఎవరైనా ఆర్థికంగా సహాయం చేస్తే బ్రతుకుతానని పొన్నాంబళం తన విన్నపాన్ని అందరి ముందుంచారు. తన సోదరి కొడుకు కిడ్నీ దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, అయితే అందుకు అయ్యే ఖర్చు పెట్టే స్తోమత తనకు లేదని దయచేసి సాయం చేయండి అంటూ పొన్నాంబళం అభ్యర్థించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసి ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్, ధాను ధనుష్, కె ఎస్ రవికుమార్, రాఘవ లారెన్స్ లాంటి ప్రముఖులు ఆర్ధిక సాయం చేయగా.. ఇప్పుడు కిడ్నీ మార్పిడి కోసం దాతలు, దక్షిణ భారత నటీనటుల సంఘం, తెలుగు మా అసోసియేషన్ తరపున తగిన ఆర్ధిక సాయం అందించాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. కేవలం నటుడిగానే కాకుండా స్టంట్ మ్యాన్‌గా పలు సినిమాల్లో తన మార్క్ చూపించాడు పొన్నాంబళం. తెలుగులో ''ఘరానా మొగుడు, అల్లరి ప్రియుడు, మొగ్గురు మోసగాళ్ళు'' వంటి సినిమాల్లో ఆయన నటించారు. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి టాప్ హీరోలతో చాలా సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38Co3zi
No comments:
Post a Comment