గత రెండు మూడు రోజులుగా సినీ నటుడు, రచయిత, దర్శకుడు నిజ స్వరూపం ఇదీ అంటూ ఓ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అవసరాల శ్రీనివాస్ దగ్గర మూడేళ్లుగా కో- డైరెక్టర్‌గా పని చేశానని, తనను అవమానించి ఆఫీస్ నుంచి గెంటేశాడని చెబుతూ మహేష్ అనే వ్యక్తి ఈ వీడియోను బయటపెట్టడంతో జనాల్లో ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఇందులో అవసరాల శ్రీనివాస్ బూతులు తిడుతూ కనిపించగా.. నేను మూడేళ్లుగా మీ దగ్గర కష్టపడుతున్నా.. నన్నెందుకు తిట్టావ్.. ఎందుకు బయటకు పంపావంటూ మహేష్ ఆవేదన చెందటం కనిపించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ షాకింగ్ వీడియో బయటకు రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇదంతా నిజామా? లేక సినిమా ప్రమోషనా? అనే డౌట్ జనాల్లో వచ్చినప్పటికీ ఇష్యూ మాత్రం చర్చల్లో నిలిచింది. అయితే అంతా భావించినట్లుగానే ఇదో ప్రమోషన్ డ్రామా అన్నట్లుగా తాజాగా విడుదలైన ‘101 జిల్లాల అందగాడు’ ఫస్ట్ లుక్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఫస్ట్ లుక్‌లో సేమ్ టు సేమ్.. వైరల్ అయిన ఆ వీడియోలో కనిపించిన అవసరాలే కనిపించారు. పైగా ఈ మూవీలో ఆయన బట్టతలతోనే కనిపించనున్నట్లు ఈ పోస్టర్ ద్వారా చెప్పడంతో జనాల్లో వచ్చిన అనుమానాలు పటాపంచలయ్యాయి. ప్రమోషన్స్ కోసమే ఆ వీడియో వదిలారు, అది ఓ డ్రామా అని అంతా ఫిక్సయ్యారు. కాగా, ‘101 జిల్లాల అందగాడు’ సినిమాలో అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్ర పోషిస్తూ కథ అందించగా.. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. హీరోయిన్. కామెడీకీ పెద్ద పీట వేస్తూ ఈ సినిమా రూపొందిస్తున్నారని, మే నెల 7వ తేదీన చిత్ర రిలీజ్ ప్లాన్ చేశారని సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NZTYmc
No comments:
Post a Comment