పాయల్ రాజ్‌పుత్ పీరియడ్స్ స్టోరీ: అమ్మాయి నెలసరి అంటూ ఏకంగా ఆ ఫొటో.. హీరోయిన్ పోస్ట్ వైరల్

సృష్టికి మూలమైన అమ్మాయి జీవితంలో ఎన్నో చెప్పుకోలేని సందర్భాలుంటాయి. ప్రతి అమ్మాయి జీవితంలో (నెలసరి) సమయం అనేది ఎంతో కీలకమైన అంశం. నిజానికి జీవిత చక్రంలో ప్రధానం అదే అయినా ఆ విషయం బయటకు చెప్పడంలో ప్రతి అమ్మాయి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. క్రమం తప్పకుండా పీరియడ్స్ వస్తున్నట్లైతే ఆ అమ్మాయి ఆరోగ్యంగా ఉందనే లెక్క అని వైద్యులు చెబుతున్నా ఆ పీరియడ్స్ డేట్స్‌ని మాత్రం సీక్రెట్‌గా ఉంచుతుంటారు లేడీస్. బాల్యం నుంచి యుక్త వయసుకు చేరుకునే సమయంలో ప్రతి మహిళ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ విషయం పట్ల సరైన అవగాహన లేని కొందరు అమ్మాయిలను టీజ్ చేసిన ఉదంతాలు చాలానే చూసాం. అయితే ఈ విషయమై అలాంటివాళ్ళందరి కళ్లు తెరిపించేలా ఓ షాకింగ్ ఫొటోను తన సోషల్ మీడియా వాల్‌పై పోస్ట్ చేసింది యంగ్ హీరోయిన్ . యుక్త వయసుకు వచ్చిన ఓ అమ్మాయి పబ్లిక్ ప్లేస్‌లో బహిష్టు కావడం, దానిపై పక్కనే ఉన్న ఓ అబ్బాయి రియాక్ట్ అయిన తీరు గురించి తెలుపుతూ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పిక్ షేర్ చేసింది పాయల్. తన కూతురు ఓ పబ్లిక్ బస్‌లో ప్రయాణిస్తుండగా మొదటిసారి పీరియడ్స్ జరిగాయని, దాంతో ప్యాంటుపై రక్తపు మరకలు పడటం చూసి పక్కనే ఉన్న ఆమెకంటే పెద్దవాడైన ఓ కుర్రాడు ఆ విషయాన్ని చెప్పి.. తన స్వెటర్ ఇచ్చిమరీ అది నడుముకు చుట్టుకొని ఇంటికి వెళ్ళమని తన కూతురుతో చెప్పాడంటూ ఓ తండ్రి ఇచ్చిన వివరణ ఆ ఫొటోపై రాసి ఉంది. ఇది చూసిన పాయల్.. సదరు ఫొటో, మెసేజ్‌ని తన సోషల్ మీడియా వాల్‌పై పోస్ట్ చేసి ఆ కుర్రాడి తల్లికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పింది. ప్రపంచంలో ఇలాంటి ధోరణి చాలా అవసరం అంటూ క్లాప్స్ కొట్టింది. దీంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. జనాలను మేలుకొలిపేలా పాయల్ పెట్టిన ఈ పోస్ట్ చూసి నెటిజన్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ''పైన పిక్ చూడగనే ఛీ ఛీ అనుకునే వాళ్ళు అందులో 9 నెలలు ఉండివచ్చారు అని గుర్తు పెట్టుకుని కింద పోస్ట్ ఫుల్‌గా చదవండి. ఈ మధ్య అబ్బాయిలు బానే అర్థం చేసుకుంటున్నారు .. కానీ కొంత మంది ఆడవాళ్ళ మూఢనమ్మకాలతో, అలానే బ్రతుకేస్తూ ఈ విషయములో ఆడ దానికి ఆడదే శత్రువు లాగా తయారువుతున్నారు'' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే రీసెంట్‌గా ఇదే పీరియడ్స్ విషయమై స్పందించిన అనసూయ.. ''ఇలాంటి విషయాలు దాచుకోకూడదని, ఇవి బాహాటంగా చెబితేనే ఈ తరం వాళ్లకు అర్థమవుతుంది'' అని చెప్పిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ పీరియడ్స్ పట్ల ఆడ, మగ అందరికీ సరైన అవగాహన ఉంటేనే ఈ సమాజానికి మేలు అనేది అక్షర సత్యం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31ekJq1

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts