బాలకృష్ణ పరిచయం కోసం బోయపాటి స్కెచ్.. నందమూరి ఫ్యాన్స్ ఎప్పటికీ చెప్పుకునేలా హైలైట్ ప్లాన్!

నందమూరి నటసింహం బాలకృష్ణకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలనే కోణంలో మాస్ డైరెక్టర్ సరికొత్తగా ఆలోచిస్తున్నారట. ''సింహ, లెజెండ్'' లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న BB3పై బోయపాటి ప్రత్యేక శ్రద్ద పెట్టారట. పవర్‌ఫుల్ కథ రాసుకొని సెట్స్ మీదకు తీసుకొచ్చిన ఆయన ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గొద్దని చిత్ర నిర్మాతలకు సూచిస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే భారీ సీన్స్ చిత్రీకరించిన ఆయన, పరిచయ సన్నివేశాన్ని నందమూరి ఫ్యాన్స్ ఎప్పటికీ చెప్పుకునేలా ఓ రేంజ్‌లో ప్లాన్ చేశారట. థియేటర్స్‌లో కూర్చున్న బాలయ్య అభిమానులు, మాస్ ఆడియన్స్ ఊగిపోయేలా ఇంట్రడక్షన్ సీన్ ఉండాలని చూస్తున్న బోయపాటి.. ఏకంగా ఈ ఒక్క సీన్ కోసమే దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలిసింది. మునుపెన్నడూ చూడని విధంగా బాలకృష్ణ కెరీర్‌లోనే తొలిసారి ఈ తరహా సన్నివేశాన్ని చూపించబోతున్నారని టాక్. ప్రస్తుతం షూటింగ్ వేగం పెంచేసిన బోయపాటి అతిత్వరలో చిత్రీకరణ మొత్తం ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతోంది. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ బాణీలు కడుతున్నారు. బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘బీబీ3 ఫస్ట్ రోర్’ నందమూరి అభిమానులను హుషారెత్తించింది. బోయపాటి మార్క్ చూపిస్తూ బాలయ్య చేత చెప్పించిన ఊరమాస్ డైలాగ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పడంతో అందరి దృష్టి రిలీజ్ డేట్‌పై పడింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మే నెల 28వ తేదీన గ్రాండ్‌గా ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bVLeoQ

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts