
తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ హీరోయిన్‌గా కన్నా క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగా రాణిస్తున్నారు. ఆమెకు హీరోయిన్‌గా రాని గుర్తింపు నెగిటివ్ రోల్స్ చేయడం వల్ల వచ్చింది. నిన్న మొన్నటి వరకు తమిళంలో బిజీగా ఉన్న వరలక్ష్మికి ఇప్పుడు తెలుగులోనూ అవకాశాలు పెరుగుతున్నాయి. ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన వరలక్ష్మి.. ‘క్రాక్’ సినిమాలో జయమ్మగా తన విశ్వరూపం చూపించారు. తాజాగా ‘నాంది’లో ఆద్య అనే లాయర్ పాత్రలో జీవించారు. అయితే, ఇప్పుడు వరలక్ష్మికి టాలీవుడ్‌ను మరో మంచి ఆఫర్ వచ్చిందని టాక్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మూవీ వస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం వరలక్ష్మిని సంప్రదించారట కొరటాల శివ. పాత్ర నచ్చడంతో వరలక్ష్మి వెంటనే అంగీకరించారని ఇండస్ట్రీ వర్గాల సమచారం. అయితే, ఆ పాత్ర ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కొరటాల శివ కచ్చితంగా వరలక్ష్మి కోసం పవర్‌ఫుల్ రోల్ రాసుంటారని అంటున్నారు. కాగా, అల్లు అర్జున్-కొరటాల శివ మూవీ పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని సమాచారం. బాలీవుడ్ నటి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుందని అంటున్నారు. అల్లు అరవింద్ కొత్త నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్.. కొరటాల శివ స్నేహితుడు, డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని సుధాకర్‌కు చెందిన యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’తో బిజీగా ఉన్నారు. మరోవైపు కొరటాల శివ చిరంజీవితో ‘ఆచార్య’ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తికాగానే బన్నీ-శివ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kzBk0h
No comments:
Post a Comment