కరోనా విజృంభణను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అన్ని నగరాలు, గ్రామాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 60 ఏళ్లు దాటిన వారితో పాటు 45 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉండి దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారికి కరోనా టీకా ఇస్తున్నారు. కోవిడ్ మరోసారి పంజా విసరబోతుందని వార్తలు వస్తున్న వేళ పలువురు సినీ ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఆయా ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ధైర్యం చెబుతున్నారు. తాజాగా మంగళవారం రోజు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని ఫస్ట్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. 60 ఏళ్ల వయసు దాటిన ఆయన తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తున్న ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని, అందుకోసం ఆన్‌లైన్‌లో రిజిష్టర్ చేసుకోవాలని కోరుతూ http://cowin.gov.in అనే వెబ్ సైట్ లింక్ కూడా పోస్ట్ చేశారు నాగ్. దేశంలో మొదటి దశ వాక్సినేషన్‌లో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, త్రివిధ దళాలు, పారిశుద్ధ కార్మికులకు కోవిడ్ టీకా ఫస్ట్ డోస్ ఇచ్చారు. ఇప్పుడు రెండో దశలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ టీకా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకోగా తాజాగా నాగార్జున కోవిడ్ టీకా వేయించుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం నాగార్జున 'వైల్డ్ డాగ్' మూవీతో బిజీగా ఉన్నారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు నాగార్జున.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qXFbWn
No comments:
Post a Comment