దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు, నిర్మాత (81) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన నిన్న (బుధవారం) హైదరాబాద్‌లోని తన సొంత నివాసంలో తుది శ్వాస విడిచారు. కృష్ణమోహన్ రావు మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడైన కృష్ణమోహన్ రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. నా మనస్సు చలించిపోయిందంటూ ఆవేదన చెందారు. ''నా సోదరుడు, దర్శకుడు రాఘవేంద్రరావు గారి అన్నగారు కృష్ణమోహన్ గారి మరణవార్త విని నా మనస్సు చలించిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను'' అని మోహన్ బాబు అన్నారు. సోదరుడైన కృష్ణమోహన్ రావు నిర్మాతగా పలు సూపర్ హిట్ సినిమాలు రూపొందించి రాణించారు. కృష్ణమోహన్ రావు, రాఘవేంద్రరావు సొంత అన్నదమ్ములే అయినా స్నేహితుల్లా ఉండేవారని వారి సన్నిహితులు చెబుతున్న మాట. మొదట తన తండ్రి నిర్మించే చిత్రాలకు నిర్మాణ వ్యవహారాలు చూసుకున్న కృష్ణమోహన్ రావు.. ఆ తర్వాత తమ్ముడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'భలేకృష్ణుడు' చిత్రం ద్వారా నిర్మాతగా మారారు. ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ స్థాపించి ''అపూర్వ సహోదరులు, యుద్ధభూమి, అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, ఘరానాబుల్లోడు, బొంబాయి ప్రియుడు'' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన రూపొందించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vWKqJM
No comments:
Post a Comment