నేడు (మార్చి 27) మెగా పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. పలు చోట్ల హ్యాపీ బర్త్ డే చెర్రీ అంటూ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి కేక్స్ కట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోకు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ దర్శకనిర్మాతలు మెగా అభిమాన లోకాన్ని ఫిదా చేసేలా చెర్రీ ప్రెజెంట్ మూవీస్ నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా కొరటాల శివ '' మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మొదటిసారి ఈ ఆచార్య సినిమాతోనే చిరంజీవి- రామ్ చరణ్ కలిసి పూర్తి స్థాయిలో తెర పంచుకోబోతున్నారు. ఈ భారీ సినిమా నిర్మాణంలో భాగమవుతూనే 'సిద్ద' అనే కీలకపాత్ర పోషిస్తున్నారు రామ్ చరణ్. ఈ పాత్ర సినిమాను మలుపుతిప్పేదిగా ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా మెగా అభిమానులను కనువిందు చేస్తూ 'ఆచార్య' నుంచి తండ్రీ కొడుకులు కలిసి ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు కొరటాల. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ చేతిలో తుపాకులు పట్టి కనిపించారు. మొత్తానికి ఈ సర్‌ప్రైజింగ్ పోస్టర్ రామ్ చరణ్ బర్త్ డేను మరింత స్పెషల్ చేసేసింది. ''ధర్మానికి ధైర్యం తోడైన వేళ'' అంటూ కొరటాల విడుదల చేసిన ఈ పోస్టర్ సామజిక మాధ్యమాల్లో వెంటనే వైరల్ అయింది. ''మీ పక్కన నటించడం అంటే నా కల నెరవేరవడం వంటిది నాన్నా.. ఇంత కంటే గొప్ప బర్త్ డే గిఫ్ట్ నేను ఇంకా ఎప్పుడూ చూడకపోవచ్చు'' అని ఈ పోస్టర్ పంచుకుంటూ రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యాడు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీలో చిరంజీవి నక్సలైట్ పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. అలా ఆ పోరాటంలోనే రామ్ చరణ్ 'సిద్ద' పాత్రలో చిరుకు తోడుగానిలుస్తాడని తాజాగా విడుదలైన పోస్టర్ ద్వారా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ మే 13న 'ఆచార్య' ప్రేక్షకుల ముందుకు రానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31pXjxK
No comments:
Post a Comment