బుల్లితెరపై జబర్దస్తీ చేస్తూ మస్త్ పాపులారిటీ సంపాదించిన యాంకర్ అనసూయ.. ప్రస్తుతం వెండితెరపై కూడా అదే హవా నడిపిస్తోంది. సుకుమార్ రూపొందించిన 'రంగస్థలం' సినిమాలో ఆమె చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ సినీ కెరీర్‌కి మంచి బూస్టింగ్ ఇచ్చింది. వరుస ఆఫర్స్ తెచ్చిపెట్టింది. అలా అటు బుల్లితెర, ఇటు వెండితెర రెండింటా తన మార్క్ చూపిస్తూ వస్తున్న ఆమె హీరోగా రాబోతున్న '' సినిమాలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుందట. తాజాగా అందుకు సంబంధించిన సమాచారం బయటకొచ్చింది. రీసెంట్‌గా అదే సుకుమార్ 'పుష్ప' సినిమాలో 'దాక్షాయణి' అనే మాస్ పాత్రలో అనసూయకు వేషం కట్టారు. ఇది డీ- గ్లామర్ ఈ రోల్ అయినా కూడా అనసూయ లుక్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే ఈ సారి మాత్రం ఖిలాడిలో గ్లామరస్‌గా కనిపిస్తూనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌తో దర్శనమీయనుందట అనసూయ. అంతేకాదు మాస్ మహారాజ్ రవితేజ అత్తగా ఆమె రోల్ సినిమాకే మేజర్ అట్రాక్షన్ కానుందనే టాక్ నడుస్తోంది. ఈ ఖిలాడి సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. అయితే ఆ ఇద్దరిలో ఒకరికి తల్లిగా అనసూయ కనిపించనుందని సమాచారం. చంద్రకళ పాత్రలో అనసూయ కట్టు, బొట్టు, నటన ఖిలాడికి బాగా ప్లస్ అవుతుందని అంటున్నారు. ఇదే గనక నిజమైతే ఇక థియేటర్లలో మాస్ మహారాజ్ అభిమానులకు పూనకాలే అని చెప్పుకోవచ్చు. జయంతిలాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/EO1C8ar
No comments:
Post a Comment