మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఉప్పెనతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన రీసెంట్‌గా కొండ పొలం అనే డిఫరెంట్ మూవీతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు '' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ జంటగా హాట్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. బాపినీడు బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. ఇటీవలే టైటిల్ టీజర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్న మేకర్స్ ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు చిత్ర ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. 'తెలుసా తెలుసా ఎవరికోసం ఎవరు పుడతారో .. ఎవరికి ఎవరేమి అవుతారో' అంటూ సాగిపోతున్న ఈ పాటలో వైష్ణవ్ తేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. శంకర్ మహదేవన్ పాడిన ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అతి త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్. త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసి ఈ ఏడాదిలోనే 'రంగ రంగ వైభవంగా' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. వైష్ణవ్ తేజ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/nJ6xRHdCI
No comments:
Post a Comment