బాలీవుడ్ బ్యూటీ RRR సినిమాతో తెలుగు తెరపై అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ చేస్తూ వివిధ ప్రోగ్రామ్స్‌లో భాగమవుతున్నారు RRR టీం. అయితే ఎక్కడికి వెళ్లినా ఎన్టీఆర్ తెలుగులోనే మాట్లాడటంపై ఆలియా రియాక్ట్ అయింది. ఎన్టీఆర్‌పై పంచ్ విసరడంతో తారక్ కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు. దీంతో ఈ ఇష్యూ వైరల్ అయింది. చిత్ర ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ ఎక్కడికి వచ్చినా తెలుగులోనే మాట్లాడుతున్నారని, అది తనకు అర్థం కాకపోవడంతో ఎవరైనా అనువదించి చెబుతారా అని దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పబ్లిక్‌గా ఆలియా ఓపెన్ అయింది. ఆమె ఈ మాటలు చెబుతుండగా ఎదురుగానే ఉన్న ఎన్టీఆర్.. ఆమెకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మేము తెలుగులోనే కాదు ఇంగ్లీష్, హిందీలో కూడా మాట్లాడుతున్నాం.. కాకపోతే అది నీకు అర్ధం కావడం లేదని అనేశారు. తారక్ కౌంటర్ ఇచ్చినప్పటికీ ఆలియా మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా కాదు కాదు మీరు ఇంగ్లీష్, హిందీలో మాట్లాడట్లేదని చెప్పింది. ఇలా RRR తారల మధ్య నడిచిన ఈ ఫన్నీ ఫ్రస్ట్రేషన్ నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఇకపోతే RRR సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుండగా.. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆమెకు మరో ఆఫర్ దక్కింది. అది కూడా ఎన్టీఆర్ సినిమాలోనే. ఎన్టీఆర్- కాంబోలో రాబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా ఆలియా భట్‌ని కన్ఫర్మ్ చేశారు. ఈ నెల 7వ తేదీన పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇప్పటివరకు టచ్ చేయని డిఫరెంట్ పాయింట్‌తో కథ సిద్ధం చేశారట కొరటాల.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/CaEIqpm
No comments:
Post a Comment