హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాపై జనాల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. వీటికి తోడు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్న మూవీ అప్‌డేట్స్ ఆ అంచనాలకు రెక్కలు కడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి లవ్ ఆంథెమ్ తెలుగు వర్షన్ రిలీజ్ చేశారు. గత బుధవారం హిందీ వెర్షన్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రబృందం తాజాగా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ లవ్ ఆంథమ్‌ని ప్రేక్షకులతో పంచుకుంది. వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఇద్దరిపై షూట్ చేసిన ఈ రొమాంటిక్ సాంగ్ ‘’ అంటూ సాగిపోతూ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ప్రభాస్, కిస్ సీన్‌తో పాటు ఇద్దరి కెమిస్ట్రీ పీక్స్‌లో ఉంది. ఈ ప్రేమగీతాన్ని సిద్ద్ శ్రీరామ్ ఆలపించిన తీరు ప్రేక్షకలోకాన్ని ఫిదా చేస్తోంది. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ రాధేశ్యామ్’ హిందీ వెర్షన్‌కు మిథున్ సంగీతం అందించగా.. మిగిలిన భాషలకు జస్టిన్ ప్రభాకరన్ బాణీలు కడుతున్నారు. ఈ మూవీలో డార్లింగ్ ప్రభాస్ లవర్ బాయ్ రోల్ పోషిస్తున్నారు. విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు. పూజాహెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తుండగా భాగ్యశ్రీ, ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్-పూజా మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3G1Akva
No comments:
Post a Comment