పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధే శ్యామ్’. హీరోయిన్. ఇప్పటి వరకు సినిమా నుంచి విడులైన ప్రభాస్ క్యారెక్టర్ టీజర్, ఈ రాతలే, నగుమోము తారలే అనే పాటలకు చాలా మంచి స్పందన వచ్చాయి. ముఖ్యంగా రీసెంట్‌గా విడుదలైన ‘నగుమోము తారలే..’ ఒక లవ్ సాంగ్. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య రొమాంటిక్ సీన్స్ ఇటు ఫ్యాన్స్, అటు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. బీచ్‌లో లైట్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉన్న డ్రెస్‌లో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య రొమాంటిక్‌గా పాట సాగుతుంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా, బ్యూటీపుల్‌గా ఉన్నాయి. ఇందులో ఎదుటివారి చేతి రేఖలను చూసి వారి భవిష్యత్తును చెప్పగల నేర్పరి అయిన హీరో.. తన ప్రేయసి చేతి రేఖలను చూసి ఆమె ప్రమాదాలను పసిగడతాడు. ఆమెను ఆ ప్రమాదాల బారి నుంచి ఎలా రక్షించుకున్నాడనేదే సినిమా కథగా వార్తలు వినిపిస్తున్నాయి. రాధే శ్యామ్‌యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్ స్టోరి. ఇందులో విక్రమాదిత్యగా ప్రభాస్.. ప్రేరణగా పూజా హెగ్డే మధ్య లవ్ ప్రేమికులను, ప్రేక్షకులను ఎలా అలరించనుందో తెలియాలంటే వచ్చే ఏడాది జనవరి 14 వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతున్నాయి. అందులో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా సినిమాలో పూజాహెగ్డే తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తి చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ తెలియజేసింది. దానికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. మరి ప్రభాస్ డబ్బింగ్ పూర్తయ్యిందా? లేక పూర్తి చేయాల్సి ఉందా? అనైతే తెలియడం లేదు. రాధే శ్యామ్‌కి సంబంధించిన మన బ్యూటీ బుట్టబొమ్మ మెయిన్ వర్క్‌ను పూర్తి చేసింది. యువీ క్రియేషన్స్, టి సిరీస్ సంస్థలపై మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద, ప్రశీద ఈ చిత్రాన్ని రూపొందించారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ సినిమాను డైరెక్ట్ చేశారు. సాహో విడుదలై రెండేళ్ల దాటేసింది. దీంతో ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా కోసం ఎదురు చూస్తున్నారు. మరో వైపు ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలను పూర్తి చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేశాడు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న సలార్ చిత్రీకరణను పూర్తి చేయాల్సి ఉంది. మరోవైపు నాగ్ అశ్విన్ సినిమాను కూడా లాంఛనంగా స్టార్ట్ చేశాడు. మరో వైపు ప్రభాస్ 25వ సినిమా స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Enlb6Z
No comments:
Post a Comment