ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలను పట్టాలెక్కించేశాడు. ఇప్పటికి రాధే శ్యామ్ రెడీ అయింది. ఆది పురుష్ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ మధ్యే చిత్రయూనిట్ ప్రభాస్‌కు వీడ్కోలు పలికింది. ఇక సలార్ సినిమా రెండు షెడ్యుల్స్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇక ప్రభాస్ స్పిరిట్ సినిమా మాత్రం ఇప్పట్లో కదిలేలా కనిపించడం లేదు. సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్‌లో రాబోయే స్పిరిట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రాబోతోన్న ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఇది పాన్ ఇండియన్ కాదు.. పాన్ వరల్డ్ అంటూ చెప్పిన మాటలతో ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. సైన్స్ ఫిక్షన్, టైం మిషన్ నేపథ్యంలో సినిమా ఉంటుందని ఇది వరకే లీకులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ప్రాజెక్ట్ కే కోసం హైద్రాబాద్‌లో ల్యాండ్ అయింది. అయితే దీపికా పడుకోణెకు వైజయంతీ మూవీస్ సంప్రదాయబద్దంగా స్వాగతాన్ని పలికింది. చీర, గాజులు, మల్లెపూలు, పసుపు, కుంకుమతో దీపికా పడుకోణెకు స్వాగతాన్ని పలికారు. దీంతో అతిథి మర్యాదలను చూసి దీపిక సర్ ప్రైజ్‌గా ఫీలైనట్టు కనిపిస్తోంది. దక్షిణాదికి చెందిన ఆడబిడ్డ.. ప్రపంచ వ్యాప్తంగా మనసులు దోచేసిందంటూ ఇలా దీపిక పదుకోణె గురించి గొప్పగా చెబుతూ.. స్వాగతం పలికారు. కలిసి ఈ ప్రపంచాన్ని దున్నేద్దాం, ఏలేద్దామంటూ చెప్పుకొచ్చింది వైజయంతీ మూవీస్. మహానటి సినిమా తరువాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ప్రాజెక్ట్ కే మీద అందరికీ ఆసక్తి నెలకొంది. ఇక వైజయంతీ బ్యానర్ మీద రాబోతోన్న 50వ సినిమా కావడంతో అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అందుకే ఎక్కడా రాజీ పడకుండా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ను కూడా సినిమాలోకి తీసుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lyKxHS
No comments:
Post a Comment