ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా కూడా ఆశించిన విజయం మాత్రం దక్కడం లేదు. వరుడు కావలెను అంటూ కొత్తగా ట్రై చేశాడు. కానీ అది కూడా అంతగా వర్కవుట్ అవ్వడం లేదు. అయితే ఇప్పుడు సరికొత్త జానర్‌లో రాబోతోన్నాడు. ఆర్చరీ నేపథ్యంలో ఇంతవరకు సినిమా రాలేదు. విలువిద్య ఎంత గొప్పదో, ఎంత ప్రాచీనమైందో అందరికీ తెలిసిందే. ఆ పాయింట్ మీదే నాగ శౌర్య అనే చిత్రం రాబోతోంది. అయితే ఈ మధ్య వదిలిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా కోసం నాగ శౌర్య ఎంత కష్టపడ్డాడో చిత్రయూనిట్ చెప్పింది. డైరెక్టర్ సంతోష్ అయితే ఏకంగా నాగ శౌర్యను ఆకాశానికెత్తేశాడు. కథను ఇంత అందంగా మలచడంలో నాగ శౌర్య పాత్రే ఎక్కువ అని క్రెడిట్ ఇచ్చేశాడు. ఇక 8 పలకల దేహం కోసం నాగ శౌర్య మూడు రోజులు పచ్చి మంచినీళ్లు కాదు కదా? కనీసం తన ఉమ్మును కూడా మింగలేదట. అలా లక్ష్య సినిమా కోసం నాగ శౌర్య చాలా కష్టపడ్డాడట. తాజాగా ఈ చిత్రంలోని సయ సయ అనే పాటను విడుదల చేశాడు. అలా శౌర్య కోసం చైతూ ముందుకు వచ్చాడు. అయితే లక్ష్య ట్రైలర్ చాలా నచ్చిందంటూ.. ఎంజాయ్ చేశానంటూ నాగ చైతన్య చెబుతూ ఈ లిరికల్ వీడియోను వదిలాడు. సయ సయ అనే పాటను చూస్తూ ఉంటే మంచి రొమాంటిక్ నంబర్‌లానే కనిపిస్తోంది. కృష్ణ కాంత్ మంచి సాహిత్యాన్ని అందించగా.. కాళ భైరవ క్యాచీ మెలోడి ట్యూన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక జునైద్ కుమార్ గాత్రం చక్కగా కుదిరింది. ఈ పాటలో కేతిక శర్మలు ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 10న రాబోతోన్న సంగతి తెలిసిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Ivzh9d
No comments:
Post a Comment