ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజకీయాల్లో భీష్ముడుగా పేరు తెచ్చుకున్న కొణిజేటి రోశయ్య (88) శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఉదయం ఉన్నట్లుండి ఆయనకు పల్స్ పడిపోయాయి. కుటుంబ సభ్యులు ఆయన్ని స్టార్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూశారు. ఈయన తమిళనాడుకి గవర్నర్‌గా కూడా సేవలు అందించారు. రోశయ్య మరణంపై రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో హీరో తన సంతాపాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ‘‘మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యగారి మరణం తీరని విషాదం. ఆయన రాజకీయాల్లో భీష్మాచార్యుడు వంటివారు. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడటంలో ఆయన రుషిలా సేవ చేశారు. వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజల మన్ననలు పొందారు. ఆయన మరణంతో రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు చిరంజీవి. కాంగ్రెస్ పార్టీ తరపున 1968లో తొలిసారి శాసన మండలికి రోశయ్య ఎన్నికయ్యారు. ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగాకు ఈయయ శిష్యుడు. కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. మొత్తంగా 15 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన రికార్డ్ ఆయన సొంతం. హెలికాప్టర్ ప్రమాదంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, 14 నెలలు పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2011లో తమిళనాడు ముఖ్యమంత్రిగానూ పని చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Eqq0MS
No comments:
Post a Comment