పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాగర్‌కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ రైటర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు అందించడమే కాదు.. పాట కూడా రాయడం విశేషం. శనివారం (డిసెంబర్ 4) రోజున ఈ సినిమా నుంచి ఎమోషనల్ సాంగ్ ‘అడవి తల్లి మాట’ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కిందున్న మనుషులకు కోపాలు తగ్గవు.. పైనున్న దేవుడేమో ఉలుకు పలుకు లేకుండా ఉంటాడు..కత్తులకు కనికరం ఉండదు.. అగ్ని అంటుకుంటే అనవాళ్లు మిగలవు.. అంటూ సాగుతున్న ఈ పాటలో చూపించిన సన్నివేశాలను గమనిస్తే, ఇందులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ పాత్రలతో పాటు సముద్ర ఖని పాత్రను కూడా ఇంట్రడ్యూస్ చేయడం విశేషం. ఈ సినిమాలో రానా తండ్రి పాత్రలో సముద్ర ఖని కనిపిస్తాడు. నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ మధ్య ఇగో గొడవల కారణంగా వారి ఎమోషన్స్ ఎలా మారుతాయి. కుటుంబ సభ్యులు ఎలా బాధపడతారు. అనే అంశాలను ఈ ‘అడవి తల్లి మాట..’ అనే సాంగ్‌లో చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి మూడు పాటలు విడుదలయ్యాయి. ‘భీమ్లా నాయక్’.. టైటిల్ సాంగ్‌ను ముందుగా విడుదల చేశారు. దీన్ని మొగిలయ్య పాడారు. ఇక రెండో సాంగ్ ‘అంత ఇష్టమేందయా’.. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్రధారిపై నిత్యామీనన్ తన ప్రేమను వ్యక్తం చేసే పాట. ఇక మూడో సాంగ్‌గా ‘లాల భీమ్లా..’ పాటను విడుదల చేశారు. ఇది హీరోయిజాన్ని తెలియజేసే పాట. దీన్ని రాయడం విశేషం. అన్నీ పాటలకు చాలా మంచి ఆదరణ లభించాయి. ఇప్పుడు ఎమోషనల్ సాంగ్ అయిన అడవితల్లి విడుదలైంది. నిజానికి ఈ పాటను డిసెంబర్ 1న విడుదల చేద్దామని భావించారు. కానీ సిరివెన్నెల సీతాారామశాస్త్రి మరణంతో పాట విడుదలను ఆపి రెండు రోజులు గ్యాప్ తీసుకుని విడుదల చేస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్‌ను కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి పాడారు. తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియమ్ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. పవన్ జోడీగా నిత్యామీనన్, రానా జోడీగా సంయుక్తా మీనన్ నటించారు. భీమ్లా నాయక్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. , రానా తొలిసారి కలిసి నటిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dkCtpG
No comments:
Post a Comment