నందమూరి నటసింహం యమ జోష్‌లో ఉన్నారు. ఇటీవలే 'అఖండ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం సాధించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది. ఈ సినిమా రూపంలో బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబోలో హాట్రిక్ హిట్ పడింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'అఖండ' మూవీ గురించిన మరో క్రేజీ అప్‌డేట్ వైరల్‌గా మారింది. మాస్ కాంబినేషన్‌లో వచ్చి ఓ వర్గంలో పూనకాలు తెప్పిస్తూ అన్నివర్గాల ఆడియన్స్ మెచ్చిన ది బెస్ట్ మూవీగా నిలిచిన 'అఖండ' త్వరలోనే ఓటీటీలో ప్రసారం కాబోతోందనే ప్రచారం ఊపందుకుంది. బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే డిసీజన్‌తో ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారట. 2022 కొత్త సంవత్సరం కానుకగా ఓటీటీలో విడుదల చేసి నందమూరి ఫ్యాన్స్ చేత ఇక ఇంట్లోనే గోలపెట్టించాలని స్కెచ్చేశారట దర్శకనిర్మాతలు. డిస్ని హాట్ స్టార్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారని టాక్. అతి త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తున్న అఖండ మూవీ కేవలం 6 రోజుల్లోనే 85 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. వెండితెరపై బాలయ్య మాస్ అప్పీరెన్స్, అఘోరాగా ఉగ్రరూపం చూసి హుషారెత్తిపోతున్నారు.ఈ సినిమాలో థియేటర్లకు మళ్ళీ మంచి రోజులు వచ్చేశాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో పూర్ణ నటించింది. బాలయ్య బాబు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. ప్రతి నాయకుడిగా శ్రీకాంత్ నటించగా.. జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించారు. అందరి నటనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pF5Cl0
No comments:
Post a Comment