సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సూక్తులు ఈ మధ్య ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. విడాకుల రూమర్లు మొదలైనప్పటి నుంచి ఏదో ఒక రకమైన కొటేషన్ సమంత షేర్ చేస్తూనే వచ్చింది. ఇక అధికారికంగా విడాకులు ప్రకటించిన తరువాత కూడా సమంత తన తీరు మార్చుకోలేదు. ప్రేమ, నిజం, ధర్మం, రాక్షసులు, మంచివాళ్లు అంటూ ఇలా ఏదో ఒక విషయం మీద సూక్తులు చెబుతూ వచ్చింది. మామ్ సెయిడ్ (అమ్మ చెప్పింది) అంటూ మరి కొన్ని కొటేషన్లను సమంత పెడుతూ వచ్చింది. అలా సమంత ఎప్పుడూ ఏదో ఒక కొటేషన్ పెడుతూనే ఉంటుంది. తాజాగా సమంత మరో సూక్తిని షేర్ చేసింది. జీవితంలో నేర్చుకున్న గుణపాఠం ఇదేనంటూ సమంత చెప్పుకొచ్చింది. తాను ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనే విషయాన్ని తెలుసుకున్నాను అంటూ ఇదే తాను నేర్చుకున్న గుణ పాఠం అంటూ తెలిపింది. మొత్తానికి సమంత ఇప్పుడు ఇలా లైఫ్ లెస్సన్ అంటూ ఎందుకు పోస్ట్ చేసిందో అర్థం కావడం లేదు. సమంత కెరీర్ పరంగా మాత్రం మంచి పీక్స్‌లో ఉంది. ఏకంగా హాలీవుడ్ సినిమాలోనే సమంత నటిస్తోంది. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే సినిమాలో 27 ఏళ్ల తమిళ యువతి, బైసెక్సువల్ పాత్రలో సమంత కనిపించనుంది. మొత్తానికి సమంత హాలీవుడ్ ఎంట్రీ మాత్రం గట్టిగానే ఉండబోతోంది. ఇక సమంత పుష్ప సినిమాలో చేయబోతోన్న స్పెషల్ సాంగ్ మీద కూడా అంచనాలు పెరిగిపోయాయి. దీంతో సమంత పుష్ప సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో సమంత రేర్ ఫీట్‌ను అందుకుంది. ఇన్ స్టాగ్రాంలో 20 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31lKFUn
No comments:
Post a Comment