డాక్టర్ రాజశేఖర్ టైటిల్ పాత్ర పోషిస్తోన్న చిత్రం ‘శేఖర్’. మలయాళ చిత్రం ‘జోసెఫ్’కు ఇది రీమేక్. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ బ్యానర్స్‌పై ఎం.ఎల్.వి.సత్యనారాయణ, శ్రీనివాస్ బొగ్గారం, శివానీ, శివాత్మిక నిర్మాతలుగా సినిమాను ప్రారంభించారు. లలిత్ దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు. శేఖర్ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌లో దర్శకుడి పేరు కూడా మనం చూడొచ్చు. అయితే ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు దర్శకుడు మారిపోయాడు. లలిత్ స్థానంలో జీవితా రాజశేఖర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అసలు డైరెక్టర్ ఎప్పుడు మారాడు? ఎలా మారాడు? అనేది తెలియకుండా సైలెంట్‌గా జరిగిపోయింది. ఇప్పుడేమో జీవిత మెగాఫోన్ పట్టుకున్నట్లు అధికారికంగా వార్తలు అయితే బయటకు వచ్చాయి. కారణాలు మాత్రం తెలియడం లేదు. డైరెక్టర్ లలిత్ తీసిన ఔట్‌పుట్ నచ్చక ఆయన స్థానంలో జీవితను దర్శకత్వం వహిస్తున్నారనేది సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న గుసగుసలు. సరే! ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్‌గా జరిగే విషయాలే. నిజానికి జీవిత దర్శకత్వం చేసి చాలా రోజులు అవుతుంది. ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఇతర వ్యక్తిగత పనులతో బిజీగా ఉండిపోయారు. అందుకు తగినట్లు ఇప్పుడు నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకోవడంతో డైరెక్షన్ వైపు చూడలేదు. అయితే శేఖర్ విషయంలో జీవితకి స్టార్ట్, కెమెరా, యాక్షన్ అని చెప్పక తప్పలేదు. మరో డైరెక్టర్‌ను పెట్టుకుంటే బడ్జెట్ పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ కోణంలోనూ ఆలోచించి ఉండొచ్చు. ఇది వరకు రాజశేఖర్‌తో శేషు, ఎవడైతే నాకేంటి, మహంకాళి చిత్రాలను జీవిత తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల చేయాలంటూ నిర్మాతలకు ఫ్యాన్సీ ఆఫర్స్ వచ్చాయట. మరి మేకర్స్ థియేటర్స్‌కు వెళ్లాలనుకుంటారో లేక స్ట్రైట్ ఓటీటీ రిలీజ్ చేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. జీవితంలో వ్యక్తిగత సమస్యల కారణంగా వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్న ఓ పోలీస్ ఆఫీసర్ తన చుట్టూ జరుగుతున్న హత్యల వెనుకున్న మిస్టరీని ఎలా చేధించాడు.. అనేదే శేఖర్ సినిమా. దీని కోసం రాజశేఖర్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. తెల్లగడ్డం పెంచుకున్నారు. ఇది వరకు కనిపించని డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నారు రాజశేఖర్. చాలా కాలంగా హీరోగా రాజశేఖర్ హిట్స్ లేకుండా చాలా ఇబ్బందులు పడ్డారు. చివరకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన గరుడవేగ చిత్రం సాధించిన హిట్‌తో ట్రాక్ ఎక్కారు. తర్వాత కల్కి అనే సినిమా చేశారు. ఇప్పుడు శేఖర్ సినిమాను చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Ers3k0
No comments:
Post a Comment