చాలా గ్యాప్ తర్వాత పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ నటిస్తోన్న విలేజ్ డ్రామా ‘’. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. అనుష్ కుమార్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం (డిసెంబర్ 12) రోజున ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ‘చూడు జయమ్మా.. నాకు తెలిసి ఈ చుట్టూ పక్కల ఊళ్లలో ఇలాంటి గొడవ జరిగి ఉండదు నీ గొడవలో న్యాయముందని నేను నమ్మతాను..రెండు రోజుల్లో నీ తగువు తీర్చేస్తాను’ అని ఊరి పెద్ద చెప్పగానే ‘రెండు రోజుల్లో తేల్చకపోతే మీరు ఉండరు.. మీ పంచాయితీ ఉండదు చెప్తున్నా’ అని వార్నింగ్ డైలాగ్‌తో జయమ్మ పంచాయితీ టీజర్ మొదలైంది. ఈ డైలాగ్ వింటే అమ్మో ఏదో పెద్ద గొడవ జరిగినట్లుందనిపిస్తుంది. ‘జయమ్మకి ఐదారు లక్షలు వస్తాయని ఊరంతా అనుకుంటా ఉండారు’ అని ఓకావిడ సుమతో అంటే.. ‘అనుకోవడమే మిగిలింది. ఆకులు నాకినోడు పోయి, మూతులు నాకినోడు వచ్చినట్లుంది’ అని సుమ కౌంటర్ డైలాగ్ అదిరిపోయింది. ‘మంచాన పడినోడి గురించి రోజూ ఈ పంచాయితీ ఏటన్నా..’ అని ఓ ఊరి పెద్ద అంటే, ‘ఏట్రా! మంచాన పడ్డాడా? నా మొగుడు నా మంచాన పడ్డాడు. నువ్వు ఎవరెవరి మంచాల మీద పడుకున్నావో తెలియదా? ప్రత్యేకించి పంచాయితీలో చెప్పాలా? ’ అంటూ సుమ మరో కౌంటర్ డైలాగ్ వింటే ఆమె చేసిన జయమ్మ పాత్ర నోటికి ఎవరైనా భయపడాల్సిందేనని అర్థమవుతుంది. సూత్తాను సూత్తాను మీ దగ్గర డబ్బులెలా వసూలు చేయాల్నో నాకు తెలుసున్లే అనే ఫైనల్ టచింగ్ ఉన్న డైలాగ్ మరో రేంజ్‌లో ఉంది. ఒకవైపు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూనే సుమ ఊరందరితో తన మొగుడు విషయంలో పెద్ద గొడవే పడుతుందని అర్థమవుతుంది. అసలు ఈ జయమ్మ పంచాయితీ గొడవేంటనేది తెలుసుకోవాలనే ఆసక్తి కూడా కలుగుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనేది దర్శక నిర్మాతలు తెలియజేస్తారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pVGBm2
No comments:
Post a Comment