సింగర్ చిన్మయికి సోషల్ మీడియాలో అమ్మాయిలు తమ బాధలను చెప్పుకుంటారు. ఇంట్లోని పరిస్థితుల చెప్పుకుని తమ బారాన్ని దించుకుంటారు. కట్నాలు అడుగుతున్నారు.. మా పెళ్లి కోసం ఇంట్లో వాళ్లు అలా కష్టపడుతున్నారు.. అత్తింటి వారు కట్నం కోసం డిమాండ్ చేస్తున్నారు.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ ఇలా అమ్మాయిలు తమ తమ బాధలను చిన్మయితో పంచుకుంటారు. వారికి తనకు తోచిన సలహాలను ఇస్తుంటుంది. ఈ మధ్య అలానే కొంత మంది అమ్మాయిలు ఎన్నారై సంబంధాల మీద ఫిర్యాదులు చేశారు. నచ్చకపోయినా క్యాస్ట్‌లోని వ్యక్తి అయితే చాలు.. వాడు వెధవైనా కూడా పెళ్లి చేసుకోవాలి.. ఎన్నారైలకు కోట్లకు కోట్లు కట్నాలు ఇవ్వాలి.. అంటూ చిన్మయి సంచలన కామెంట్స్ చేసింది. అయితే ఎన్నారైలంతా కూడా అలాంటి వారేనా? అంటూ చిన్మయి మీద కొంత మంది ట్రోలింగ్‌కు దిగారు. దానిపై చిన్మయి కౌంటర్లు కూడా వేసింది. అయితే ఓ ఇద్దరు ఎన్నారైలు చిన్మయి మద్దతుగా నిలిచారట. మీరు చెప్పినట్టుగానే చాలా మంది ఎన్నారైలు ప్రవర్తిస్తున్నారు.. మీ మీద నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.. కానీ అవన్నీ పట్టించుకోకండి.. మీరు సరైన దారిలోనే వెళ్తున్నారు.. అమ్మాయిలకు అవగాహన కలిగిస్తున్నారు.. ఇది చాలా మంచి కార్యక్రమం. మీ మాట విని ఒక్కరు మారినా చాలు.. అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడినా చాలు అంటూ ఓ ఇద్దరు ఎన్నారైలు చిన్మయికి మద్దతుగా నిలిచారు. నిజమైన మనుషులు, మగాళ్లకు నా పోస్ట్‌లతో ఎలాంటి బాధ ఉండదు.. వారికి ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఓ ఆడది నో చెబితే తట్టుకోలేని వాళ్లు, వాళ్ల ఆధిపత్యం ఎక్కడ కోల్పోతారో అని బాధపడే వాళ్లు మాత్రమే ఇలా చేస్తారు. మరీ ముఖ్యంగా ఇలా తనకు మద్దతుగా నిలిచిన ఇద్దరు మగాళ్లు మాత్రం బంగారం అంటూ చిన్మయి పోస్ట్ చేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3drlBNV
No comments:
Post a Comment