క్రమంగా వెండితెర స్టార్స్ బుల్లి తెరపై సత్తా చాటుతున్నారు. పలు టీవీ షోస్‌కి హోస్టులుగా, గెస్టులుగా వచ్చి తెగ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా స్టైలిష్ స్టార్ బుల్లితెరపై అడుగుపెట్టి తెగ సందడి చేశారు. ఈ టీవీలో ప్రసారమవుతున్న కోసం గెస్టుగా వచ్చిన బన్నీ.. రావడం రావడమే గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ ఏ బిడ్డ.. ఇది నా అడ్డా అంటూ పుష్పరాజ్ డైలాగ్‌తో అదరగొట్టేశారు. తాజాగా ఈ ఎపిసోడ్ తాలూకు ప్రోమో రిలీజ్ చేయగా అది నెట్టింట వైరల్ అవుతోంది. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ కాన్సెప్ట్‌తో కంటెస్టెంట్స్ మధ్య హోరాహోరీగా సాగుతోన్న తుదిపోరుకు గెస్టుగా వచ్చిన అల్లు అర్జున్.. తెగ ఎంజాయ్ చేస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేశారు. అనంతరం విజేతకు టైటిల్ అందించారు. అయితే బన్నీ ఇచ్చిన గ్రాండ్ ఎంట్రీ సుధీర్- ఆదిల వరుస పంచ్ డైలాగ్స్, ఈ షో జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్న పూర్ణ, ప్రియమణిలపై అల్లు అర్జున్ చేసిన సరదా కామెంట్స్‌తో ఈ ప్రోమో వీడియో అదిరిపోయింది. ఇకపోతే ఈ వీడియోలో ప్రియమణి- అల్లు అర్జున్ మధ్య నడిచిన సంభాషణ హైలైట్ అయింది. అల్లు అర్జున్‌తో నటించలేదనే బాధ నాకు ఇప్పటికీ ఉంది అని చెప్పడంతో అల్లు అర్జున్ వెంటనే అందుకొని ఆమెపై హాట్ కామెంట్స్ చేశారు. వర్క్ చేయలేదని అస్సలు అనుకోవద్దు. ఇంకా ఇప్పటికీ ఛాన్స్ ఉంది.. పైగా బాగా సన్నబడి హాట్‌గా తయారయ్యావ్ అని అల్లు అర్జున్ అనడంతో ప్రియమణి ఆనందంతో తెగ నవ్వేసింది. బన్నీ చేసిన ఈ క్రేజీ కామెంట్ విని యాంకర్స్ రష్మీ గౌతమ్, ప్రదీప్ అయితే పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. మరికొద్ది రోజుల్లో పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన పుష్పరాజ్ రోల్ చేస్తుండగా.. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు ప్రియమణి కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో వెండితెరపై రాణిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dinOeK
No comments:
Post a Comment