బాహుబలితో వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి. ఇప్పుడాయన సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, చెన్నైలలో ప్రెస్‌మీట్స్‌ను ఇప్పటికే చిత్ర యూనిట్ పూర్తి చేసింది. ఇక హైదరాబాద్‌లో శనివారం ప్రెస్‌మీట్‌ను నిర్వహిస్తున్నారు. అయితే చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మీ నెక్ట్స్ మూవీ ఎవరితో ఉండొచ్చు అని ఓ విలేఖరి ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానమిస్తూ.. ‘‘నా నెక్ట్స్ మూవీ మహేష్ బాబుతో ఉంటుంది. ఈ విషయాన్ని ఇది వరకే చెప్పేశాను. అయితే ఇప్పుడా సినిమా గురించి ఆలోచించే పరిస్థితులు లేవు. RRR సినిమా విడుదలై.. అందరూ సినిమాను ఆదరించి బ్రహ్మాండంగా ఉందని చెప్పిన తర్వాతే మహేష్ సినిమా గురించి ఆలోచిస్తాను’’ అని అన్నారు రాజమౌళి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ RRR. ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్, హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ తదితరులు నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంటైర్ ఇండియా సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒక వైపు మెగాభిమానులు, నందమూరి అభిమానులు కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. అసలు చరిత్రలో ఎన్నడూ కలుసుకోని ఇద్దరూ యోధులు కలుసుకుని, బ్రిటీష్ వారిని ఎదిరిస్తే.. ఎలా ఉంటుందనే అంశంతో RRR సినిమాను రూపొందించారు రాజమౌళి. రూ.400 కోట్ల బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా పది వేలకు పై థియేటర్స్‌లో సినిమాను విడుదల చేసేలా రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన RRR థియేట్రికల్ ట్రైలర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 24 గంటల్లోనే ఐదు భాషలకు కలిపి 51.1 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. ఇక సినిమా విడుదల తర్వాత కలెక్షన్స్ పరంగా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తోందోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lTMdMa
No comments:
Post a Comment