ఐకాన్ స్టార్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ సినిమా 'పుష్ప'. తగ్గేదే లే అంటూ రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగాన్ని డిసెంబర్ 17వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన సుక్కు.. డిసెంబర్ 12వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు రాజమౌళి, కొరటాల శివ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ఈ వేడుకలో పుష్పరాజ్ తన మాటలతో అభిమానులను హూషారెత్తించారు. ముందుగా తగ్గేదే లే అనే డైలాగ్‌తో తన అభిమానులతో కేకలు పెట్టించిన అల్లు అర్జున్.. తనదైన బాడీ లాంగ్వేజ్‌తో, మాస్ మాటలతో వేదిక ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఇలా మీ ముందుకు రావాలనే ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నట్లు బన్నీ తెలిపారు. ఈ రచ్చ ఆపొద్దని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ''నేను ఎప్పుడూ అంటూ ఉంటాను ప్రతి ఒక్కరికి కూడా అభిమానులు ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంది నేను ఇంతవరకు ఏదైనా సంపాదించుకున్నాను అంటే అది మీ అభిమానమే. నాకు మీకంటే ఏదీ ఎక్కువ కాదు. నన్ను నమ్మండి. అందరి కంటే అన్నిటికంటే ఎక్కువగా కూడా నా అభిమానులంటేనే చాలా ఇష్టం ఐ లవ్ యు. ఈ ఫంక్షన్‌కి వచ్చిన ప్రతి ఒక్కరికీ స్వాగతం. ఈ వేడుకకు వచ్చిన అతిథులకు మీడియా మిత్రులకు అలాగే రాజమౌళి గారికి కొరటాల శివ గారికి అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నా. ముందుగా పుష్ప కోసం ఓ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్‌కి థాంక్యూ. ఒక్కో పాట నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. నేను మ్యూజిక్ లవర్. ఎక్కడా తగ్గకుండా దేవీ శ్రీ ట్యూన్స్ అందించారు. ఈ రోజు దేవి శ్రీ, సుకుమార్ ఇద్దరినీ చాలా మిస్ అవుతున్నాను. చంద్రబోస్ అందించిన లిరిక్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజు చంద్రబోస్ గారు జనాలను ఎంటర్‌టైన్ చేసే స్థాయి నుంచి తన పదాలతో స్ఫూర్తినిచ్చే స్థాయికి ఎదిగారు. ఈ సినిమా గురించి ఒకటే మాట చెప్పగలను. ఈ ఒక్క సినిమా కోసం నాలుగు సినిమాలకు పడినంత కష్టం పడ్డామని చెప్పవచ్చు. టెక్నీషియన్స్ అంతా నిరంతరం కష్టపడ్డారు. పేరుపేరునా అన్ని డిపార్ట్మెంట్స్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నా. మనం చాలా మందితో పని చేస్తాము కానీ మనసుకు నచ్చిన అమ్మాయి రష్మిక. ఆమె నేషనల్ క్రష్ కాబట్టి నేను ముద్దుగా క్రష్మిక అని పిలుస్తుంటా. ఎంతో టాలెంట్ ఉన్న రష్మికకు మంచి ఫ్యూచర్ ఉంది. ముఖ్యంగా సమంత గారికి ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నా. ఈ సినిమాలోని ఐటెమ్ సాంగ్ విషయంలో ఏ మాత్రం అభ్యంతరం చెప్పకుండా మేము ఎలా అడిగితే అలా తన వృత్తికి న్యాయం చేశారు సమంత. ఈ సాంగ్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ఈ సినిమాలో నటించిన రావు రమేష్, సునీల్, అనసూయ, ధనుంజయ్ ఇలా అందరికీ పేరుపేరునా థాంక్యూ. మైత్రి నిర్మాతలు లేకుండా ఈ సినిమా ఇంత ఈజీగా పూర్తి అయ్యేది కాదని నేను చాలా బలంగా చెబుతున్నా. మా మామయ్యలతో ముత్తంశెట్టి మీడియా అనే బ్యానర్ పెట్టించి ఈ సినిమాలో భాగం చేయడం చాలా ఆనందంగా ఉంది'' అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించిన ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చిత్రంలో అల్లు అర్జున్ మాస్ రోల్ చేయగా.. పల్లెటూరు అమ్మాయిగా నటిస్తోంది. సమంత స్పెషల్ సాంగ్ చేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33ePgbi
No comments:
Post a Comment