కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న థియేటర్స్‌కు జనాలు వస్తారో రారో అని సినీ పరిశ్రమలో తెలియని ఓ టెన్షన్ ఉండేది. అయితే రీసెంట్‌గా విడుదలైన చిత్రాలకు దక్కిన ప్రేక్షకాదరణతో ఇతర భారీ చిత్రాల దర్శకులు, నిర్మాతలకు ధైర్యం వచ్చింది. దీంతో థియేటర్స్‌కు సినిమా రిలీజ్‌ల రూపంలో తాకిడి పెరిగింది. పాన్ ఇండియా సినిమాలు ఒకవైపు.. అప్ కమింగ్ సినిమాలు మరో వైపు.. మోస్తరు, చిన్న సినిమాలు ఒక సైడ్ ఇలా ఏకధాటిగా సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్స్‌లో సినిమా రిలీజ్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఈ కోవలో ఈ ఏడాది క్రిస్మస్‌కు టాలీవుడ్ నుంచి ఇద్దరు అప్ కమింగ్ స్టార్ హీరోల సినిమాలు.. మంచి బజ్‌ను క్రియేట్ చేసుకున్నవి విడుదలకు సిద్ధమని ప్రకటించాయి. ఆ సినిమాలు ఏవో కావు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని, నేచురల్ స్టార్ హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్. గని, శ్యామ్ సింగరాయ్ సినిమాల జోనర్స్ వేరు. డిసెంబర్ 24న వస్తామని ఈ రెండు సినిమాలకు చెందిన నిర్మాతలు అధికారిక ప్రకటనలు విడుదల చేశారు. అయితే గని విడుదల అనౌన్స్‌మెంట్ వచ్చిన వారం తర్వాత సినిమా పోస్ట్ పోన్ కానుందంటూ వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి. నెట్టింట చక్కర్లు కొట్టిన వార్తలే ఇప్పుడు నిజమయ్యాయి. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన గని చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. థియేటర్స్ ఎక్స్‌పీరియెన్స్ కోసం రూపొందించిన సినిమాల్లో గని ఒకటని, ఈ పోటీ కారణంగా.. సినిమాను విడుదల చేస్తే ప్రేక్షకులకు అది రీచ్ కాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల గని చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామన్నారు మేకర్స్. నిజానికి కోవిడ్ లేకుండా ఉండుంటే ఈ ఏడాది సమ్మర్‌లోనే సినిమా విడుదల కావాల్సింది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. చివరకు డిసెంబర్ 4న విడుదల అని ప్రకటించారు. కానీ మళ్లీ ఆ రిలీజ్ డేట్‌ను డిసెంబర్ 24కి మార్చారు. ఇలా ఇప్పటికే మూడు సార్లు సినిమా వాయిదా పడింది. మరి గని కొత్త రిలీజ్ డేట్ ఎప్పడు ఉండచ్చో తెలియాలంటే వెయిటింగ్ తప్పదు. గని వాయిదా అధికారికం కావడంతో, నాని మూవీ శ్యామ్ సింగరాయ్‌కు రూట్ క్లియర్ అయినట్టే. నాని హీరోగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడొన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3EMjQqK
No comments:
Post a Comment