యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అమ్మ అంటే ఉండే ప్రేమ, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను ఈ స్థాయిలో అభిమానుల ముందు నిలబడి ఉన్నానంటే కారణం.. ఆమె చిన్నప్పటి నుంచి తనపై తీసుకున్న శ్రద్ధే కారణమని పలు సందర్భాల్లో ఆయన చెప్పారు. ఆమె ఎన్టీఆర్‌ను ఓ విషయంలో వారించేదని రీసెంట్‌గా ముంబైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో తెలియజేశారు. అసలు ఇంతకీ ఎన్టీఆర్‌ను ఆయన తల్లి ఏ విషయంలో వారించేవారు? ఎందుకు ? అనే వివరాల్లోకి వెళితే.. గురువారం ముంబైలో జరిగిన RRR ట్రైలర్ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ‘‘నటుడు అనేవాడు సౌకర్యవంతంగా ఉండే పాత్రలను చేయాలనుకోకూడదు. విలక్షణమైన పాత్రలు చేయాలని నమ్మే వ్యక్తుల్లో నేనూ ఒకడిని. అలా నేను సౌకర్యవంతంగా ఉన్నానని అనుకున్నప్పుడల్లా రాజమౌళిగారు నన్ను బయటకు తీసుకొస్తుంటారు. ఆయన గొప్ప దర్శకుడే కాదు.. నాకెంతో ఆప్తుడు కూడా. ఇక అజయ్ దేవగణ్‌గారి గురించి చెప్పాలంటే, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పనిచేస్తుంటే ఓ గురువుతో కలిసి పనిచేస్తున్నట్లే ఉండేది. ఆయన ‘పూల్ ఔర్ కాంటే’ చిత్రంలో చేసిన యాక్షన్ స్టంట్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. రెండు బైక్స్‌పై ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలతో స్టన్ అయిపోయాను. నేను అలా చేయడానికి ప్రయత్నించాలని అనుకుంటున్నట్లు అమ్మతో చెబితే అవన్నీ సినిమాల్లోనే కుదురుతాయి. నిజ జీవితంలో కావంటూ ఆమె హెచ్చరిస్తూ వారించేది. అలాంటి గురువులా భావించే వ్యక్తితో RRR సినిమాలో కలిసి నటించడం గొప్పగా ఉంది’’ అన్నారు తారక్. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించిన చిత్రం RRR. 1920 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ. చరిత్రలో కలుసుకోని ఇద్దరు యోధులు కలుసుకుని బ్రిటీష్ వారిపై తిరగబడితే ఎలా ఉంటుందనే కథాంశంతో సినిమా రూపొందింది. ఇందులో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్ కూడా నటించారు. ఇంకా సముద్ర ఖని, అజయ్ దేవగణ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి, ఒలివియా మోరిస్ వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో నటించారు. రూ.400 కోట్ల బడ్జెట్‌తో చేసిన ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న విడుదలవుతుంది. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రం కావడంతో ఎంటైర్ ఇండియా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గురువారం విడుదలైన RRR ట్రైలర్ నెట్టింట వ్యూస్, లైక్స్ పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rR96Ul
No comments:
Post a Comment