నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై విజయవంతగా దూసుకెళ్తోంది. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా అంచనాలను అందుకుంది. మాస్, ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటూ మంచి వసూళ్లను రాబడుతుంది. డిసెంబర్ 2న విడుదలైన మూడు రోజులకు కలిపి రెండు తెలుగు రాష్ట్రాలు (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ)లో రూ.26-28 కోట్ల వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక యు.ఎస్‌లో ఇప్పటి వరకు 700K డాలర్స్ వసూళ్లను రాబట్టుకుని రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తే శ్రీకాంత్, పూర్ణ, జగపతిబాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అయితే వీరితో పాటు ఈ సినిమాలో రెండు గిత్తలు కూడా కీలకంగా కనిపిస్తాయి. రాయలసీమ పాత్రధారి మురళీకృష్ణగా నటించిన బాలకృష్ణ పెంపుడు గిత్తలుగా కనిపించిన ఇవి.. హీరో ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సీన్స్, యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాయి. అసలు ఈ గిత్తలు ఎవరివి? అని సందేహం రావచ్చు. ఇవి తెలంగాణలోని భువనగిరి జిల్లా చౌటుప్పల్ లక్కారం గ్రామానికి చెందిన ఆర్గానిక్ రైతు శ్రీనివాస్ యాదవ్‌వి. పదహారు నెలల వయసు నుంచి ఈ గిత్తలను శ్రీనివాస యాదవ్ పెంచుతున్నారు. వాటికి కృష్ణ, అర్జున్ అనే పేర్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు మూడేళ్లు వయసున్న ఆ గిత్తల గురించి తెలుసుకున్న బోయపాటి శ్రీను తన సినిమా కోసం వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి యాక్ట్ చేయించుకున్నారు. రెండు రోజుల పాటు ఎద్దులకు సంబంధించిన సన్నివేశాలను బోయపాటి శ్రీను అండ్ టీమ్ చిత్రీకరించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఒకటేమో అనంతపురంకు చెందిన రైతు. ఫ్యాక్షనిజం రూపుమాపడానికి ప్రయత్నిస్తుంటాడు. మరో పాత్ర శివ సైనికుడిగా కనిపించారు. నటీనటుల పనితీరుతో పాటు తమన్ సంగీతం కూడా సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచింది. కవలలుగా పుట్టినవారు అనుకోని పరిస్థితుల్లో విడిపోతారు. వారిలో ఒకడికి కష్టం వచ్చినప్పుడు ఆ దైవం మరో సోదరుడిని పంపి ఏం చేసింది. విధికి, విధాతకు సవాల్ విసిరిన విలన్స్‌కు శివ సైనికుడైన హీరో ఎలా సమాధానం ఇచ్చాడు అనేదే కథాంశం. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dhMMea
No comments:
Post a Comment