స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ కుమార్తె మరోసారి వార్తల్లో నిలిచింది. రీసెంట్గా తన మానసిక సమస్యలు, తనపై జరిగిన లైంగిక దాడి విషయాలను బయటపెడుతూ సంచలనం సృష్టించిన ఆమె.. తాజాగా డేటింగ్ వ్యవహారంతో జనం నోళ్ళలో నానుతోంది. తన ఫిట్నెస్ ట్రైనర్‌తో ఆమె ప్రేమాయణం నడుపుతుండటం బీ టౌన్ వర్గాల్లో హాట్ ఇష్యూగా మారింది. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి అతనితో బ్రేకప్ చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఫిట్నెస్ ట్రైనర్ నుపూర్ శిఖారెతో డేటింగ్ చేస్తోంది ఐరా ఖాన్. ఆమిర్‌ఖాన్ జిమ్ ట్రైనర్ అయిన నుపూర్ లాక్డౌన్ సమయంలో ఐరా చేత కూడా వర్కవుట్స్ చేయిస్తూ స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాడట. ఆ సమయంలోనే వీరి ప్రేమ చిగురించినట్టు సమాచారం. గత 6 నెలలుగా వీరి మధ్య అఫైర్ నడుస్తుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే వీటిపై రియాక్ట్ అయిన ఐరా.. గతంలో మాదిరిగా తన రిలేషన్ గురించి పబ్లిక్‌గా మాట్లాడను అని తెలిపింది. Also Read: ఐరా ఖాన్- నుపూర్ శిఖారె ప్రేమకు ఐరా తల్లి రీనా దత్తా ఆమోదం లభించిందట. అలాగే మహాబలేశ్వరంలోని ఆమీర్ ఖాన్ ఫామ్‌హౌస్ లోనే కొన్ని రోజులు సన్నిహితంగా గడిపారట. స్నేహితులతో పార్టీలు కూడా అక్కడే చేసుకుంటున్నట్లు టాక్. సినీ గడప తొక్కకముందే అఫైర్లతో ఇలా ఫేమస్ అవుతోంది ఐరా ఖాన్. ఇక నూపూర్ విషయానికొస్తే.. బాలీవుడ్లో పలువురు స్టార్లకు ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉన్నారు. సుస్మితా సేన్‌కు గత పదేళ్లుగా ట్రైనర్‌గా ఉన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KHi9DT
No comments:
Post a Comment