నాగార్జున 'వైల్డ్ డాగ్'కి భారీ ఆఫర్.. ఓటీటీ లోనే రిలీజ్!

లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ మూతబడటంతో పలు సినిమాల విడుదల వాయిదాపడి ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ కరువైంది. దీంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఓటీటీ సంస్థలు భారీ సినిమాలను కొనుగోలు చేసి విడుదల చేస్తున్నాయి. మరోవైపు థియేటర్స్ లేక చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. నాని V, అనుష్క 'నిశ్శబ్దం' లాంటి పెద్ద సినిమాలు కూడా ఆన్‌లైన్ వేదికలపైనే విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే మరో భారీ సినిమా '' కూడా ఓటీటీ లోనే రిలీజ్ కాబోతోందని తెలిసింది. హీరోగా తెరకెక్కిన 'వైల్డ్ డాగ్' సినిమా ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకుంది. దీంతో త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని చూస్తున్నారు మేకర్స్. మరోవైపు ప్రస్తుతం థియేటర్లు తెరవడానికి అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ తరుణంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి 'వైల్డ్ డాగ్' మూవీకి భారీ ఆఫర్ దక్కిందట. దీంతో చిత్ర దర్శకనిర్మాతలు అటువైపుగా మొగ్గు ఓటీటీలో విడుదల చేసేందుకు రెడీ అయ్యారని టాక్. Also Read: మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిసోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నాగార్జున గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలో పని చేసే విజయ్‌వర్మ అనే ఏజెంట్‌గా ఆయన నటించారు. ఇక ఈ చిత్రంలో నాగార్జున సరసన దియామీర్జా నటిస్తున్నారు. సయామీ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా ఈ మూవీ నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fB7y8U

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts