లాక్‌డౌన్‌లో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటల్లో జంట ఒకటి. తాను ప్రేమించిన అమ్మాయి షాలినీని నితిన్ వివాహం చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితమే కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ జోడీ ఒక్కటైంది. అయితే పెళ్ళికి ముందే కొన్ని సినిమాలను లైన్‌లో పెట్టిన నితిన్.. పెళ్లైన వెంటనే ఆయా షూటింగ్ పనులతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'రంగ్ దే' మూవీ దుబాయ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. దీంతో పనిలో పనిగా తన భార్యతో హనీమూన్ ట్రిప్ కూడా ఎంజాయ్ చేస్తున్నారట నితిన్. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'రంగ్ దే' మూవీ లోని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం నితిన్ టీమ్ దుబాయ్ టూర్ వేసింది. అయితే అక్కడికి నితిన్ తన భార్యామణి షాలినిని కూడా వెంటబెట్టుకొని వెళ్లారని తెలుస్తోంది. ఈ జంట దుబాయ్ లోని ఓ స్టార్ హోటల్‌లో ప్రత్యేక గదిలో దిగారట. సమయానికి వెళ్లి లొకేషన్స్‌లో తన పార్ట్ షూటింగ్ చేసుకొని, ఆ వెంటనే భార్య షాలినితో దుబాయ్ అంతా చుట్టేస్తున్నారట నితిన్. పని పట్ల నితిన్ డెడికేషన్, అలాగే భార్య పట్ల ఆయనకున్న ప్రేమ చూసి ఆయనను అభినందిస్తూనే సరదాగా ఆటపట్టిస్తోందట 'రంగ్ దే' టీమ్. Also Read: సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నితిన్, కీర్తి సురేష్ జంటగా 'రంగ్ దే' మూవీ తెరకెక్కుతోంది. 'తొలిప్రేమ','మజ్ను' వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యువ దర్శకుడు 'వెంకీ అట్లూరి' ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువతకు కావాల్సిన అన్ని అంశాలతో 2021 సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fGIHAu
No comments:
Post a Comment