ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ 'పుష్ప' చేస్తున్న అల్లు అర్జున్.. తన తదుపరి సినిమాను కొరటాల శివతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. ఓ ఆసక్తికరమైన పోస్టర్ రిలీజ్ చేసి బన్నీ- కొరటాల కాంబోను కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతోంది? స్టోరీ లైన్ ఏంటి? అనే దానిపై క్రేజీ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఇందులో చేయబోయే రోల్ గురించిన విషయాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఎన్నటికీ గుర్తుండిపోయేలా ఆయన కోసం ప్రత్యేకంగా బలమైన కథ రెడీ చేస్తున్నారట . సామాజిక కోణంలో ఎంచుకున్న కథకు తనదైన స్టైల్‌లో మెరుగులు దిద్దుతున్నారట. ఫస్టాఫ్ అంతా అల్లు అర్జున్‌ని స్టూడెంట్ లీడర్ గానూ, అదేవిధంగా సెకండాఫ్ అంతా రాజకీయ నాయకుడి గానూ చూపించనున్నారనే టాక్ బయటకొచ్చింది. ఈ క్యారెక్టర్స్ కోసం బలమైన డైలాగ్స్ కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అల్లు అర్జున్ ఫైట్ చేయడం ఈ సినిమాలో చూడొచ్చని అంటున్నారు. ఇది చూసి తెలిసి బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. Also Read: ఇవే నిజమైతే బన్నీ కెరీర్‌లో కొరటాలతో చేయబోయే ఈ మూవీ ఓ మైలురాయిగా నిలవడం కన్ఫర్మ్ అంటూ అప్పుడే లెక్కలు వేయడం స్టార్ట్ చేశారు అల్లు అర్జున్ అభిమానులు. ఇకపోతే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ఇందులోనూ ఆయనది డిఫరెంట్ క్యారెక్టరే. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించనుండగా, ఆయన సరసన రష్మిక మందాన తన అందాలతో మ్యాజిక్ చేయనుంది. ఈ మూవీ షూటింగ్ ఫినిష్ కాగానే కొరటాల శివతో సినిమా స్టార్ట్ చేయనున్నారు అల్లు అర్జున్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36kfpEF
No comments:
Post a Comment