ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్న భారీ సినిమా ''. ఇటీవలే ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో యావత్ సినీ లోకమంతా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ భారీ మూవీలో ప్రభాస్‌తో కలిసి నటించనున్న నటీనటులు ఎవరనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో రాముడిగా నటిస్తున్న ప్రభాస్‌ని ఢీకొట్టే రావణుడి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌ని తీసుకున్న యూనిట్.. లక్ష్మణుడి పాత్రను మాత్రం సస్పెన్సులో పెట్టేసింది. రాముడి తమ్ముడైన లక్ష్మణుడి పాత్ర సినిమాకు చాలా కీలకం కాబట్టి ఈ పాత్ర ఎవరు చేస్తారనే దానిపై సినీలోకం ఆతృతగా ఎదురు చూస్తోంది. అయితే ఇందుకోసం ఓ యువ నటుడిని తీసుకున్నట్లు ప్రచారం ఊపందుకుంది. మొదట ఆయనెవరో కాదు టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు అన్నారు. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఆదిపురుష్‌లో లక్ష్మణుడి పాత్ర కూడా బాలీవుడ్ నటుడినే వరించిందని, బాలీవుడ్ యువ నటుడు సన్నీ సింగ్‌ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్. ప్రభాస్ కెరీర్‌లో 22వ సినిమాగా రానున్న ఈ ఎపిక్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, స్టార్ వార్స్ ఫేమ్ స్పెషలిస్టులను తీసుకున్నారట మేకర్స్. అలాగే ప్రభాస్ సరసన సీత పాత్ర కోసం కృతిసనన్‌ని కన్ఫర్మ్ చేశారని మరో సమాచారం. 2021 ప్రారంభంలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్తుందని ప్రకటించారు మేకర్స్. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ ఎత్తున ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mixxUV
No comments:
Post a Comment