బుల్లితెరపై బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టీఆర్పీ పరంగా చూసినా, ప్రేక్షకాదరణ పరంగా చూసినా ఈ రియాలిటీ షోకి ఉన్న పాపులారిటీ మరే ఇతర ప్రోగ్రామ్‌కి లేదని అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్‌పై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీనికి అనుగుణంగానే బిగ్ బాస్ యాజమాన్యం సరికొత్తగా ప్లాన్ చేస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. ఇందులో భాగంగా ఈ వారం ఎపిసోడ్ కోసం నాగార్జునతో పాటు రచ్చ చేసేందుకు మరో స్టార్ హీరోను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే మూడు సీజన్లలో భారీ ఆదరణ చూరగొన్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోనూ అదే హవా కొనసాగిస్తోంది. మొదట కాస్త తడబడినా ఆ తర్వాత పుంజుకొని వినూత్నంగా ముందుకెళ్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఊహించని గెస్టులను ఆహ్వానిస్తూ ఇప్పటికే ఉన్న క్రేజ్ అమాంతం పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం జరిగే ఎపిసోడ్‌లో నాగార్జునతో కలిసి రచ్చ చేసేందుకు కన్నడ స్టార్ హీరో రంగంలోకి దించుతున్నారు. Also Read: నిన్ననే నాగార్జునతో పాటు షూటింగ్‌లో పాల్గొన్నారు సుదీప్. ఆదివారం ఎపిసోడ్‌లో ఆయన చేతుల మీదుగా ఒక కంటెస్టెంట్‌ను సేవ్ చేయడంతో పాటు త్వరలో కన్నడంలో తాను ప్రారంభించబోతున్న బిగ్ బాస్‌కు సంబంధించిన విషయాన్ని కూడా సుదీప్ షేర్ చేసుకుంటారని సమాచారం. వీకెండ్ ఎపిసోడ్స్‌లో రెగ్యులర్‌గా స్పెషల్ సర్‌ప్రైజ్‌లు ఇస్తూ బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ ఈ వారం సుదీప్ హంగామాతో మ్యాజిక్ చేయనుండటం ఆసక్తికర అంశం. ఇకపోతే తాను బిగ్ బాస్ హౌస్‌లో గెస్టుగా కనిపించనున్న విషయాన్ని సుదీప్ స్వయంగా ట్వీట్ చేస్తూ నాగార్జునతో కలిసి దిగిన పిక్ షేర్ చేశారు. నాగార్జునతో కలిసి తెలుగు బిగ్ బాస్ తెరపై కనిపించనుండటం, బిగ్ బాస్ కంటిస్టెంట్లతో మాట్లాడుతూ సరదాగా గడపడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VewLg8
No comments:
Post a Comment