సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న ప్రియుడితో మూడు ముళ్ళేయించుకున్న ఈ బ్యూటీ.. పెళ్లైన వెంటనే ఆయనతో మాల్దీవ్ టూర్ వేసి అక్కడి అందమైన లొకేషన్స్‌లో విహరిస్తోంది. సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ భర్త ఒడిలో హాయిగా సేదతీరుతోంది. పైగా ఎప్పటికప్పుడు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. కేవలం మల్లెపూలను ఫోటోను మాత్రమే షేర్ చేస్తూ దానిపై అట్రాక్ట్ చేసే కామెంట్ పెట్టింది కాజల్. తెలుగు సినిమాలతో పాటు నిజ జీవితంలోనూ మల్లెపూలకు ఎంత ప్రాధాన్యమిస్తారో మనందరికీ తెలుసు. వాటిని చూపిస్తే తరువాత వచ్చే సీన్ ఏంటో కూడా అందరికీ ఇట్టే అర్థమైపోతుంది. మరి కొత్తగా పెళ్ళై హనీమూన్ ట్రిప్‌లో ఉన్న కాజల్ ఆ మల్లెపూలను షేర్ చేసిందంటే.. ఆ నవదంపతులు ఓ రేంజ్ ఎంజాయ్ చేస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఈ ఫోటో చూసి 'నాటీ కాజల్' అంటూ రొమాంటిక్ రియాక్షన్ ఇస్తున్నారు నెటిజన్లు. Also Read: ఇప్పటికే అండర్ వాటర్ రొమాన్స్, అక్వేరియం లాంటి బెడ్రూం, బీచ్‌లో సరసాలు.. ఇలా చాలా ఫొటోలతో తమ హనీమూన్ ఎలా సాగిపోతుందో తెలిపింది కాజల్. మరోవైపు ఇంటర్వ్యూలు ఇస్తూ పర్సనల్ లైఫ్ గురించి సీక్రెట్స్ చెబుతూనే ఉంది. దీంతో కాజల్ తన పెళ్లి ప్రకటన చెప్పినప్పటి నుంచి నేటివరకూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3q4fHHJ
No comments:
Post a Comment