సినీనటులు సెట్లో తమకు అవమానం జరిగిందనో, యూనిట్ సరైన ఏర్పాట్లు చేయలేదనో షూటింగ్ నుంచి వెళ్లిపోవడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇటీవల విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ‘లాభం’ అనే తమిళ సినిమా షూటింగ్ నుంచి హీరోయిన్ శ్రుతిహాసన్ అర్ధాంతరంగా వెళ్లిపోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే యూనిట్ కోవిడ్ నిబంధనలు సక్రమంగా పట్టించుకోకపోవడం వల్లనే తాను వెళ్లిపోవాల్సి వచ్చిందని తర్వాత ఆమె వివరణ ఇచ్చారు. అయితే సెట్లో తన కుక్కకి అవమానం జరిగిందన్న కోపంతో ఓ స్టార్ హీరోయిన్ షూటింగ్ నుంచి వెళ్లిపోయిన ఘటన మీకు తెలుసా..
సూపర్‌స్టార్ కృష్ణకు హీరోగా బ్రేక్ ఇచ్చిన సినిమా ‘ 116’. హాలీవుడ్‌లో విజయవంతమైన జేమ్స్‌బాండ్ తరహా సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలన్న కోరికతో నిర్మాత డూండీ ఈ సినిమాను నిర్మించారు. అప్పటికే ‘తేనె మనసులు’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న కృష్ణను హీరోగా తీసుకున్నారు. తమిళంలో అప్పటికే స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న జయలలితను కథానాయికగా తీసుకున్నారు. గూడచారి 116 సినిమా దాదాపు పూర్తికావొస్తున్న సమయంలో తన కుక్కకు అవమానం జరిగిందని అలిగి షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయారట. దీంతో దర్శక నిర్మాతలు ఆమె తీరుపై మండిపడ్డారట. కృష్ణతో జయలలితకు మిగిలున్న షాట్స్‌ని, కొన్ని క్లోజప్ సీన్స్‌ని ముందుగానే తీసుకొని ఆమె ఇచ్చిన కాల్షీట్స్ కంటే ముందే పంపించేశారట. 1967 లో విడుదలైన ‘గూఢచారి 116’ సినిమా ఘన విజయం సాధించింది.from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Jf8inZ
No comments:
Post a Comment