బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్న కొత్త సినిమా 'గాలి సంపత్'. అనిల్ కో డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్ బ్యానర్ సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ హీరో , లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నటకిరీటి డా. గాలి సంపత్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అరకులో జరుగుతోంది. రాజేంద్ర ప్రసాద్, హీరో శ్రీ విష్ణుతో పాటు సినిమాలో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ 5 వరకు జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుంది. ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఓ డిఫరెంట్ ఎమోషన్‌తో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్‌మెంట్ జోడించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. Also Read: ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్, తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, మిర్చి కిరణ్, సురేంద్ర రెడ్డి, గగన్, మిమ్స్ మధు, అనీష్ కురువిల్లా, రజిత, కరాటే కళ్యాణి, సాయి శ్రీనివాస్, రూపలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసి విడుదల చేస్తామని అంటోంది చిత్రయూనిట్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lgO22w
No comments:
Post a Comment