గత 25 ఏళ్ల క్రింద తెలుగు సినీ ప్రేక్షకులకు 'పెళ్లి సందడి' రూపంలో ఓ కొత్త రకం వినోదాన్ని పంచిన దర్శకేంద్రుడు .. తిరిగి అదే పేరులో ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ మోడ్రన్ పెళ్లి సందడిని ఇటీవలే కన్ఫర్మ్ చేస్తూ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నారని తెలిపిన ఆయన, హీరోయిన్ ఎవరనేది మాత్రం సస్పెన్స్ లోనే పెట్టి ఆమె కోసం వేట ప్రారంభించారు. లేటెస్ట్ సమాచారం మేరకు రోషన్‌తో రొమాన్స్ చేయబోయే అందాల భామను కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. పాత పెళ్లి సందడితో హీరో శ్రీకాంత్ కెరీర్‌ని మలుపుతిప్పిన దర్శకేంద్రుడు.. ఇప్పుడు కొత్త పెళ్లి సందడితో శ్రీకాంత్ తనయుడు రోషన్ కెరీర్ నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ఇందులో నటించబోయే హీరోయిన్, నటీనటుల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టారట. ఇప్పటికే శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్‌ని ఓ హీరోయిన్‌గా తీసుకున్నారని తెలియగా.. మరో హీరోయిన్‌గా మలయాళ భామ మాళవిక నాయర్‌ని ఓకే చేశారనేది ఇన్‌సైడ్ టాక్. విజయ్ దేవరకొండ, నాని ప్రధాన పాత్రల్లో వచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో, అలాగే 'టాక్సీ వాలా' సినిమాలో నటించి తనని తాను ప్రూవ్ చేసుకుంది మాళవిక. ఈ నేపథ్యంలో పెళ్లి సందడిలో మాళవిక అందాలను హైలైట్ చేస్తూ ఆమె కెరీర్ లోనూ ఈ సినిమాను టర్నింగ్ పాయింట్ చేయాలని భావిస్తున్నారట రాఘవేంద్ర రావు. ఇదే గనక నిజమైతే కెరీర్ పరంగా ఇక మాళవిక వెనుకకు తిరిగి చూడాల్సిన అవరసరమే రాకపోవచ్చు. Also Read: ఈ మోడ్రన్ పెళ్లి సందడికి రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేపట్టనుండగా.. గౌరీ రోనంకి దర్శకత్వం వహించనున్నారు. ఆక్రా మీడియా వర్క్స్ సమర్పణలో రాఘవేంద్ర రావు సోదరుడు కె. కృష్ణమోహన్ రావు నిర్మించనున్నారు. అప్పట్లో తనదైన బాణీలతో పెళ్లి సందడి కళ తెచ్చిన కీరవాణి మరోసారి తన సంగీతంతో కట్టిపడేయనున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o7u3Fn
No comments:
Post a Comment