నన్ను చూసి జాలిపడాల్సిన అవసరం లేదు.. అలాగని గర్వంగా చెప్పుకునేందుకు ఇంకా నేనేమీ చేయలేదు. అలాంటి పని చేసినప్పుడే ఖచ్చితంగా గర్వంగా ఫీలవుతా.. ఇకపై అలాంటి ప్రయత్నాలే చేస్తా అంటోంది సౌత్ ఇండియన్ శృంగార తార . ఓ శృంగార తారగా మళయాల ఇండస్ట్రీని ఏలిన షకీలా.. స్టార్ హీరోలతో ఢీకొట్టి అనేక ఆటు పోట్లు.. మరెన్నో వంచనలు.. నమ్మకద్రోహాలతో జీరో పొజీషన్‌కి వచ్చేసింది. తాను నమ్మకద్రోహానికి గురైనా.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పరిస్థితుల్ని చూసి పారిపోలేదు. తనకు ఎక్కడైతే అవమానం జరిగిందే అక్కడే ఎదురొడ్డి నిలబడతానంటోంది. మరో జన్మంటూ ఉంటే మళ్లీ షకీలాగానే పుడతానంటోంది. Read Also: తాజాగా షకీలా తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. సంపూర్ణేష్ బాబు తల్లిగా ‘కొబ్బరి మట్ట’ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ పోషించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇక తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటిస్తానంటోంది షకీలాతో ప్రముఖ యూ ట్యూబ్ సంచలనం టీఎన్ఆర్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో ఆయన మాత్రమే ప్రశ్నలు అడగటం కాకుండా.. షకీలా జీవితంపై పలువురికి ఉన్న సందేహాలను తీర్చే ప్రయత్నంలో గ్రూప్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో షకీలా జీవితంపై అనేక మంది వివిధ రకాల ప్రశ్నలు అడిగారు. ఇందులో టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సందర్భంగా మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయా? అన్న ప్రశ్నకు సమధానం ఇస్తూ టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు షకీలా. Read Also: షకీలా మాట్లాడుతూ.. ‘నేను శృంగార తారగా అనేక చిత్రాల్లో నటించినప్పటికీ ఇండస్ట్రీ నుండి లైంగిక వేధింపులు ఎదురుకాలేదు. కెమెరా ముందు నేను అర్ధనగ్నంగా నటించడానికి నేను ఇబ్బంది పడలేదు. పాపం శ్రీరెడ్డిలా గుడ్డలిప్పుకుని రోడ్డుమీద నిలబడలేను. నా చేతుల కష్టంపై ఫైట్ చేసి వెనక్కి రాగలిగా’ అన్నారు షకీలా. అయితే అంతకు ముందు మరో ఇంటర్వ్యూలో.. ‘నేను చాలా సినిమాలు చేసినప్పటికీ ఎవరూ పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. అయితే ఒక నిర్మాత సినిమా షూటింగ్ అయిపోయిన తరవాత వస్తావా అని అడిగాడు. అతని పేరు చెప్పడం ఇష్టం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది షకీలా.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZdW992
No comments:
Post a Comment