యంగ్ రెబెల్ స్టార్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ‘బాహుబలి’ పుణ్యమా అని అంతర్జాతీయ స్థాయిలో పేరు మారుమోగిపోతోంది. అయితే ఇటీవల ప్రభాస్ ‘సాహో’ సినిమా చిత్రీకరణను ముగించుకుని హైదరాబాద్ వస్తుండగా.. అభిమానులు ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. వారి కోసమని ప్రభాస్ ఎంతో ఓర్పుతో ఫొటోలకు పోజులిచ్చారు ఆ సమయంలో ఓ యువతి ప్రభాస్ తనతో ఫొటో దిగాడన్న ఆనందంతో ‘డార్లింగ్’ చెంపపై సున్నితంగా కొట్టింది. దాంతో ప్రభాస్ కొంత షాకైనా నవ్వి ఊరుకున్నారు. దీని గురించి ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘అలాంటి చేష్టలు నాపై ప్రేమతోనే చేస్తుంటారు. ఆమె కొట్టినందుకు నేనేమీ బాధపడలేదు. నన్ను కలవకుండా ఆరాధిస్తున్న అభిమానులు ఎందరో ఉన్నారు. వారందరికీ నేను రుణపడి ఉంటాను’ అని తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్.. ‘సాహో’ సినిమా ప్రచార కార్యక్రమాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిరోజే సినిమా రూ.50 కోట్ల బడ్జెట్‌ను రాబడుతుందని సినీ విశ్లేషకుల అంచనా.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HsDFYk
No comments:
Post a Comment