ఎప్పుడో కానీ తారక్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు కనిపించవు. ఆయన ఏదో ఒకటి పోస్ట్ చేయకపోరా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో తారక్ జక్కన్న ఫొటోతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. రాజమౌళి సెట్స్‌లో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించారు. ఈ ఫొటోకు తారక్ ఇచ్చిన క్యాప్షన్ హైలైట్‌గా నిలిచింది. ‘మ్యాన్ బిఫోర్ ది స్టార్మ్’ అని తారక్ క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్‌లో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా రెండో షెడ్యూల్‌కు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, తారక్ కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 22న సినిమాలో తారక్‌కు సంబంధించిన లుక్‌ను విడుదల చేయబోతున్నారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. డీవీవీ దానయ్య సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో చెర్రీకి జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. తారక్ పాత్రకు జోడీగా ఇంకా వెతకాల్సి ఉంది. ఇప్పటికే ఓ బ్రిటిష్ నటిని సినిమాలో ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2020, జులై 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LgU5V1
No comments:
Post a Comment