ఇప్పటివరకు బాలీవుడ్ నటి ఎందరో దర్శక, నిర్మాతలతో కలిసి పనిచేశారు. ఆమె భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ కూడా పేరున్న నిర్మాతే. కానీ ఆయన నిర్మాణంలో ఇప్పటివరకు విద్య ఒక్క సినిమాలో కూడా నటించింది లేదు. అలా ఎందుకు అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ‘ఎందుకంటే.. అది టూ మచ్ అయిపోతుంది. నేను నటిస్తున్న సినిమా దర్శకుడు, నిర్మాతతో ఏవన్నా సమస్యలు వస్తే వారితో నేను వాదిస్తాను. గొడవపెట్టుకోను కానీ నా వాదనలో న్యాయం ఉంటుంది. ఒకవేళ నా భర్త నిర్మాణంలో పనిచేయాల్సి వస్తే ఆయనతో ఏదన్నా సమస్య ఎదురైనప్పుడు గొడవ పడుతూనే ఉంటాను. మా వివాహబంధంలో ఎలాంటి సమస్యలు రాకూడదన్నది నా అభిప్రాయం. మేం ఇద్దరం చాలా స్క్రిప్ట్స్ చేయాలని అనుకున్నాం. కానీ పారితోషికం విషయంలో మాత్రం ఆయనతో గొడవపడలేను. నా భర్తగా కాకుండా ఓ నిర్మాతగా.. విద్య నీకు ఇంతే పారితోషికం ఇస్తానని ఆయన అన్నప్పుడు.. కాదు నాకు ఎక్కువ కావాలని అడుగుతాను. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే మాటా మాటా పెరిగి గొడవకు దారితీస్తుంది. అలాంటి సంఘటనలు మా మధ్య జరగకూడదని అనుకుంటున్నాను’ అని వెల్లడించారు విద్య. ఇటీవల విడుదలైన ‘మిషన్ మంగళ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విద్య. అక్షయ్ కుమార్, విద్యా బాలన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం విద్య హ్యూమన్ కంప్యూటర్‌గా పేరొందిన గణితవేత్తగా శకుంతలా దేవి బయోపిక్‌లో నటిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MNidBY
No comments:
Post a Comment