అక్కినేని వారి కోడలు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి స్పెయిన్‌లోని ఇబిజా ఐల్యాండ్స్‌లో హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు. తన మావయ్య కింగ్ నాగార్జున బర్త్‌డే నిమిత్తం అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఇబిజాకు వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం ఇబిజా కాల్మాలో నాగార్జున పుట్టినరోజు వేడుక జరిగింది. భార్య అమల, కుమారులు నాగచైతన్య, అఖిల్, కోడలు సమంతలతో కలిసి నాగార్జున తన 60వ పుట్టినరోజును జరుపుకున్నారు. అయితే, మావయ్య పుట్టినరోజు వేడుకలో సమంత వేసుకున్న డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాగార్జున బర్త్‌డే పార్టీలో సమంత పింక్ కలర్ వన్-షోల్డర్ షిమ్మర్ డ్రెస్ వేసుకున్నారు. ఈ పొట్టి డ్రెస్‌లో స్విమ్మింగ్ పూల్ వద్ద నిలబడి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు విపరీతమైన స్పందన వచ్చింది. అయితే, సమంత వేసుకున్న డ్రెస్ ఖరీదు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ డ్రెస్ ఖరీదు అక్షరాలా రెండు లక్షల రూపాయలని అంటున్నారు. అందుకే ఈ డ్రెస్ హాట్ టాపిక్‌గా మారింది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యామిలీ ఫొటోను కూడా షేర్ చేసినప్పటికీ తన ఫొటో మాత్రం బాగా వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే, తన మావయ్య నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కూడా సమంత ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్టులో నాగార్జున ఫొటోను పొందుపరిచారు. ఈ ఫొటోలో నాగార్జున స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి తన శరీర సౌష్టవాన్ని ప్రదర్శిస్తున్నారు. కాగా, సామ్ ఇటీవల ‘ఓ బేబీ’ సినిమాతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె తమిళ హిట్ చిత్రం ‘96’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ఇందులో శర్వానంద్ హీరో. దిల్‌రాజు నిర్మాత. ఇది కాకుండా ఒక వెబ్ సిరీస్‌లో కూడా సమంత నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZC0Fyz
No comments:
Post a Comment