థియేటర్స్‌లో ‘సాహో’ మేనియా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ థియేటర్స్ వద్ద చూసినా ప్రభాస్ అభిమానుల కోలాహలంతో సందడిగా ఉంది. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రం ఇప్పటికే పలుచోట్ల ప్రదర్శితం కావడంతో సినిమా ఎలా ఉంది? ప్రభాస్ బాహుబలి రికార్డ్‌లను బ్రేక్ చేశాడా? సుజీత్ డైరెక్షన్ బాగుందా? యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉన్నాయి? లాంటి చర్చలతో పాటు ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో మెరిసిన శ్రీలంక సుందరి జాక్వలిన్ ఫెర్నాండెజ్‌పై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ‘సాహో’ చిత్రంలో బాగా పాపులర్ అయిన సాంగ్ ఏదైనా ఉంది అంటే.. అది ఆమె ప్రభాస్‌తో ఆడిపాడిన బ్యాడ్ బాయ్ సాంగ్. ‘సాహో’ ప్రీ రిలీజ్ సందర్భంగా విడుదల చేసిన ఈ సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేసింది. కాగా ఈ సాంగ్ కోసం ఈ భామ ఏకంగా రూ. 2 కోట్ల పారితోషికంగా తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఒక్కసాంగ్‌కి రూ. 2 కోట్లా అంటూ చాలా మంది నోరెళ్లబెట్టారు. అయితే ఈ బ్యాడ్ బాయ్ సాంగ్‌ను వెండితెరపై చూసిన ప్రేక్షకులు అందచందాలకు ఫిదా అవుతున్నారు. తన అందచందాలతో అదరహో అనిపించింది జాక్వలిన్. తన ఒంపుసొంపుల వయ్యారాలతో మెలికలు తిరుగుతూ కనువిందు చేసింది. ప్రభాస్ పక్కన మరింత గ్లామరస్‌గా కనిపించింది. ఆమెతో పాటు అందమైన మోడల్స్‌తో సాంగ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఈ పాటను బాలీవుడ్ కంపోజర్ బాద్‌షా స్వరపరిచారు. నీతి మోహన్‌తో కలిసి ఆయనే ఆలపించారు. శ్రీజో సాహిత్యం అందించారు. మొత్తానికి తీసుకుంటే తీసుకుంది కాని.. రూ. 2 కోట్లు వాటికి న్యాయం చేసిందనే అంటున్నారు సినీ అభిమానులు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UmxHxG
No comments:
Post a Comment