భారీ అంచనాల మధ్య సాహో సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుడ్, బ్యాడ్ రివ్యూలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబడుతోంది. అయితే సినిమా విడుదలైన రోజే వివాదంలో పడింది. సినిమాలోని ‘బేబీ వోంట్ యూ టెల్ మీ’ అనే పాటలో బ్యాక్‌గ్రౌండ్‌లో డిజైన్ మీకు గుర్తుందా? ఆ డిజైన్‌ను షైలో శివ్ సులేమాన్ అనే ఆర్టిస్ట్ రూపొందించినదట. ఈ విషయాన్ని షైలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ.. తాను రూపొందించిన అసలు డిజైన్ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ డిజైన్‌ను షైలో 2014లో రూపొందించారట. తన క్రియేటివిటీని దొంగిలించి కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదని వాపోయారు. దీనిపై బాలీవుడ్ నటి లీసా రే స్పందిస్తూ.. ‘ఇలా ఒకరి పనితనాన్ని దొంగిలించేవారికి వ్యతిరేకంగా నిలబడి ఖండించాల్సిన సమయం వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదు. భారీ సినిమాను తెరకెక్కించిన ఓ నిర్మాణ సంస్థ ఒకరి ఆర్ట్ వర్క్‌ను దొంగిలించడం కరెక్ట్ కాదు. దీనిని దొంగతనం అంటారు. ప్రపంచంలో ఎక్కడా వీటిని సహించరు’ ‘ఆర్ట్ వర్క్‌ను ఉపయోగించడానికి ముందు (నిర్మాణ సంస్థ) ఒక్కసారి కూడా షైలో అనుమతి తీసుకోలేదు. కనీసం ఆమె పనితనాన్ని వాడుకున్నందుకు క్రెడిట్ కూడా ఇవ్వలేదు. క్రియేటర్లను అందరూ దైవంగా భావిస్తారు. వారి ప్రతిభను దొంగలించకూడదు. మీ ఇంట్లోకి ఒక దొంగ చొరబడి మీ విలువైన వస్తువులను దొంగిలిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి’ అని పేర్కొన్నారు. ఈ విషయంపై సాహో చిత్రబృందం స్పందించాల్సి ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zAuO2B
No comments:
Post a Comment